Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆ సినిమా హిట్‌ పడితే అమ్మడికి ఛాన్స్‌ లు

పూజా హెగ్డేకు కాలం కలసి రావట్లేదా?
పూజా హెగ్దే అల్లు అర్జున్‌ తో చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాలో గ్లామర్‌ ట్రీట్‌ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత నుంచి అమ్మడు వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. వరుస స్టార్‌ ఛాన్స్‌ లతో కెరీర్‌ పీక్స్‌కి చేరింది. స్టార్‌ సినిమా అంటే చాలు పూజా హెగ్దే హీరోయిన్‌ అనే రేంజ్‌కి వెళ్లింది.

ఈమధ్య పూజా హెగ్దే నటించిన సినిమాలేవి అంతగా సక్సెస్‌ కాకపోవడంతో దర్శక నిర్మాతలు కూడా ఆమెను లైట్‌ తీసుకుంటున్నారు. ప్రస్తుతం బుట్ట బొమ్మ చేతిలో మహేష్‌ గుంటూరు కారం మాత్రమే ఉంది. ఆ సినిమా హిట్‌ పడితే అమ్మడికి ఛాన్స్‌ లు వస్తాయేమో కానీ అసలు సూపర్‌ ఫాం లో ఉన్న బుట్ట బొమ్మ ఒకేసారి ఇలా ఖాళీ అవడం వెనక రీజన్‌ ఏంటా అని ఆరా తీస్తున్నారు.

ఇది కూడా చదవండి….డైమండ్‌ రింగ్‌ ఇచ్చి ప్రపోజల్‌ చేసిన వరుణ్‌ తేజ్

మహేష్‌ సినిమా తప్ప మరో స్టార్‌ సినిమా కనీసం డిస్కషన్‌ లో కూడా లేదు. అందుకే అమ్మడు బాలీవుడ్‌ విూద స్పెషల్‌ ఫోకస్‌ చేస్తుంది.

గుంటూరు కారం ఘాటైన హిట్‌ పడితే కానీ మళ్లీ తెలుగులో పూజా హెగ్దే తిరిగి ఫాంలోకి వచ్చే ఛాన్స్‌ కనిపించడం లేదు. అయితే ఆ సినిమాలో కూడా పూజాతో పాటుగా శ్రీ లీల కూడా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటుంది.

సినిమా హిట్‌ పడినా బేబీకి ఏమాత్రం కలిసి వస్తుందో చూడాలి. హిందీలో ఒకటి రెండు సినిమాలు డిస్కషన్‌ స్టేజ్‌ లో ఉన్నాయని తెలుస్తుండగా వాటి గురించి త్వరలో క్లారిటీ రానుంది. తమిళ పరిశ్రమ నుంచి కూడా పూజా హెగ్దేకి పెద్దగా ఛాన్స్‌ లు రావట్లేదు.