Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డైమండ్‌ రింగ్‌ ఇచ్చి ప్రపోజల్‌ చేసిన వరుణ్‌ తేజ్

9న వరుణ్‌,లావణ్యల ఎంగేజ్‌మెంట్‌
గతేడాది లావణ్య పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులో స్నేహితులతో పార్టీ చేసుకోగా ఆ పార్టీలో వరుణ్‌ కూడా పాల్గొని  లావణ్య త్రిపాఠికి డైమండ్‌ రింగ్‌ ఇచ్చి మరీ మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికి వీరి పెళ్లి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం గమనార్హం.అయితే వీరిద్దరికి మిస్టర్‌ మూవీ సమయంలో పరిచయం ఏర్పడిరది.

2017లొ తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ మూవీ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. ఆ మూవీ హిట్‌ కాకపోయినా వీరిద్దరి మధ్య కెమిస్టీ వర్కౌట్‌ అవ్వడం విశేషం. ఆ తర్వాత అంతరిక్షంలోనూ వీరిద్దరూ జంటగా కనిపించారు.

ఇది కూడా చదవండి……గీత ఆర్ట్స్‌ లో మూడు సినిమాలు చేస్తున్న చందూ మొండేటి

లావణ్య ఉత్తరప్రదేశ్‌ కి చెందిన యువతి కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి… ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ’గాంఢీవదారి అర్జున’.
మరొకటి… ఏవియేషన్‌ థ్రిల్లర్‌. దానిని సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం బుడాపెస్ట్‌ సిటీలో ప్రవీణ్‌ సత్తారు యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా షూటింగ్‌ చేస్తున్నారు.