Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గీత ఆర్ట్స్‌ లో మూడు సినిమాలు చేస్తున్న చందూ మొండేటి

అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ’2018’ సినిమా సక్సెస్‌ గురించి, అది ఎందుకు అందరూ చూడాల్సిందో అని వివరించడానికి విూడియా మాట్లాడారు.  దర్శకుడు చందూ మొండేటి మూడు సినిమాలు తమ గీత ఆర్ట్స్‌ లో చేస్తున్నాడని చెప్పారు.

’కార్తికేయ 2’ విడుదల కాకముందే చందు మొండేటి గొప్ప దర్శకుడు అని గుర్తించి అతనికి మా గీత ఆర్ట్స్‌ లో సినిమా చెయ్యమని చెప్పడం జరిగిందని అల్లు అరవింద్‌ చెప్పారు.

అతని సినిమా విడుదల అయి సుమారు ఒక సంవత్సరం అవుతోందని, అదీ కాకుండా ఈమధ్య కాలంలో చందుకు చాలా పెద్ద పెద్ద ఆఫర్స్‌ వచ్చాయని, అయినా కూడా అతను నాకు ఇచ్చిన కమిట్మెంట్‌ వలన, వేరే సినిమాలు చెయ్యకుండా, నాకు చేశాకే వేరే సినిమా చేస్తా అన్నాడు.

ఇది కూడా చదవండి….వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదు

ఈమధ్య కొందరు ఆలా నాకు కమిట్మెంట్‌ ఇచ్చి గీత దాటి వెళ్లారు, వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు, అని పరోక్షంగా దర్శకుడు పరశురామ్‌ ను ఉద్దేశించి అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే అక్కడ పరశురామ్‌ పేరు చెప్పకపోయినా అర్థం అయిపోతుంది.

ఎందుకంటే పరశురామ్‌ గీత ఆర్ట్స్‌ కి సినిమా చేయాల్సి ఉండగా, ఇంకో నిర్మాత దిల్‌ రాజు కి సినిమా చేస్తాను అని ఒప్పుకొని అధికారికంగా ప్రకటించాడు కదా. అప్పుడు అల్లు అరవింద్‌ చాలా సీరియస్‌ అయి, ప్రెస్‌ విూట్‌ పెట్టి మాట్లాడతా అని అనగానే, అతన్ని పరిశ్రమలో కొంతమంది పెద్దలు సర్ది చెప్పి సరిపెట్టారు.

ఆ విషయం అందరికీ తెలిసిందే,  పరశురామ్‌ చేసిన పనిని పరోక్షంగా చిన్న సెటైర్‌ తో పేల్చారు.