Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదు

వందకోట్లతో సినిమా తీయబోతున్నా
వివరాలు మా విష్ణు చెబుతాడు
తిరుమలను దర్శించుకున్న మోహన్‌బాబు
తిరుమల,జూన్‌1 : టాలీవుడ్‌ విలక్షణ నటుడు, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు వంద కోట్ల సినిమా తెయబోతున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా మొదలు కానుందని తెలిపారు. తిరుమలకు వచ్చిన ఆయన ఈమేరకు ఓ ప్రకటన చేశాడు. గురువారం తిరుమలకు వచ్చిన మోహన్‌ బాబు.. వీఐపీ బ్రేక్‌ దర్శణంలో శ్రీవారిని దర్శించు కున్నారు.

ఇందులో భాగంగా విూడియాతో మాట్లాడిన ఆయన.. అక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, మంచి వాతావరణం ఉందని తెలిపారు. అంతేకాదు తాము నిర్మించబోయే వంద కోట్ల సినిమా గురించి కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం తనయుడు మంచు విష్ణు చెబుతాడని మోహన్‌బాబు అన్నారు.

మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇష్యూపై కూడా స్పందించాడు. ఇటీవల రజనీకాంత్‌.. టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో గెస్ట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు రజనీ. అది కాస్త వివాదంగా మారింది.

ఇది కూడా చదవండి…ఆదర్శ నేతగా నిలిచే సత్తా ఉంది కెసిఆర్‌కు మాత్రమే

మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు రజనీకాంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే మోహన్‌ బాబుకు ఈ విషయం పై ప్రశ్న ఎదురైంది.. ’రజనీకాంత్‌ వ్యవహారంపై విూరు మౌనంగా ఉండటానికి కారణమేంటని ఒక రిపోర్టర్‌ ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మోహన్‌ బాబు ’తాను వివాదాల జోలికి వెళ్లదలుచుకోలేదని, రజనీకాంత్‌ గురించి మాట్లాడాలంటే ఒక రోజైనా సరిపోదని దాటవేసే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుతం మోహన్‌బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఫుల్‌ వైరల్‌ అవుతున్నాయి. టిటిడీ ఈఓ ధర్మారెడ్డిని ఆరు నెలల తరువాత కలిసాను అని, అతనికి జరిగిన నష్టం చాలా ఘోరం అయినదని, ఆ నష్టం పూడ్చలేనిది మోహన్‌ బాబు చెప్పారు.

ధర్మారెడ్డి కుమారుడు కొన్ని నెలల క్రితం గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. అలాగే దర్శనం చాలా బ్రహ్మాండంగా అయిందని, టిటిడి చైర్మన్‌ వై వి సుబ్బారెడ్డిని కూడా కలిసానని, ఇద్దరూ చాలా చక్కగా చేస్తూ భక్తులకు దర్శనాలు చాలా చక్కగా చేయిస్తున్నారు అని చెప్పారు.

అలాగే తన విశ్వవిద్యాలయం గురించి చెప్పారు. ఇక సినిమా విషయానికి వస్తే 100 కోట్లు పెట్టి ఒక భారీ బ్జడెట్‌ చిత్రం ఎలాన్‌ చేస్తున్నట్టు చెప్పారు మోహన్‌ బాబు. ఈ చిత్ర విశేషాలు విష్ణు చెపుతాడు అని చెప్పారు.