Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆదర్శ నేతగా నిలిచే సత్తా ఉంది కెసిఆర్‌కు మాత్రమే

రాజకీయాల్లో కెసిఆర్‌ది సక్సెస్‌ ఫార్ములా !
ప్రణాళికాబద్ద రాజకీయాలకు పెట్టింది పేరు కెసిఆర్‌. తెలంగాణ ఉద్యమాన్ని,ఆటుపోట్లను బాగా ఔపోసన పట్టిన తరవాతనే.. దాన్ని సాధించేందుకు ఎంచుకున్న మార్గంలో ఓ సక్సెస్‌ ఫార్ములాను ఆయన అనుసరించారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఇక్కట్లను ఎలా అధిగమించాలో కూడా ఆయన తన రోడ్‌ మ్యాప్‌లో నిర్దేశించుకున్నారు.

రాకెట్‌ ప్రయోగం లో ఎలాంటి ప్రణాళిక ఉంటుందో తెలంగాణ సాధనలోనూ..తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లోనూ.. పథకాలను అమలు చేయడంలోనూ.. అంతకు మించిన ప్రణాళిక దాగివుంది. అందుకే ఆయన రాజకీయ జీవితం అప్రతిహతంగా కొనసాగుతోంది.

గుడ్డెద్దు చేల్లో పడ్డట్లుగా కెసిఆర్‌ రాజకీయాలు చేయరని ఆయన సక్సెస్‌ను గమనించిన వారు చెబుతారు. గత ఎన్నికల్లో మరోమారు విజయం సాధించడంలోనూ.. ఎన్నికల ను ముందుకు జరిపి ముందస్తుకు వెళ్లడంలోనూ అనూహ్యమైన ప్రణాళిక ఉంది. ప్రజలనాడి పట్టకుండా రాజకీయాలు చేసే వారు ఫెయిల్‌ అవుతారు. ఇది బాగా ఎరిగిన వారు సక్సెస్‌ అవుతారు. అందుకే రాజకీయాల్లో కెసిఆర్‌ సాధించిన విజయాలు మరు పార్టీ లేదా నేత సాధించలేక పోతున్నారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన సందర్భంలో ఆయన విజయానికి ఇదే కారణం. కానీ ప్రణాళికా లోపంతో ఎన్టీఆర్‌ వంచనకు గురయ్యారు. ఎపిలో కూడా జగన్‌ ప్రజలనాడి తెలుసుకుని ..చంద్రబాబు వ్యతిరేకాంశాలతో పాదయాత్రలో ప్రజలకు నమ్మకం కలిగించారు. అందుకే అక్కడ అధికారంలోకి వచ్చారు. అయితే వచ్చిన అధికారం నిలబెట్టుకునేందుకు పడుతున్న తంటాలు వేరు. చంద్రబాబు కూడా మామను వెన్నుపోటు పొడిచినంత ప్రజల్లో అనుకూలతను సాధించలేకపోయారు.

దేశ రాజకీయాల్లో కెసిఆర్‌ది మాత్రమే ఓ సక్సె ఫార్ములాగా చెప్పుకోవాలి. ఇక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తలకెత్తు కునే ముందు కెసిఆర్‌ కూడా ఎంతగానో మేధోమధనం చేశారు. తను ఎంచుకున్న మార్గంలో ముళ్లు, రాళ్లు,ఎగుడుదిగుడులు ఉంటాయిని తెలిసీ..వాటిని ఎలా తొలగించుకుంటూ ముందుకు సాగాలో కూడా ప్రణాళిక మేరకు ముందుకు సాగారు.

ఆయనను దగ్గరగా చూసిన వారికి ఆయన రచిస్తున్న వ్యూహాలు తెలుసు. నెలల తరబడి నిద్రాహారాలు కూడా మానేసి ఆయన ఓ రోడ్డు మ్యాప్‌ గీసుకుని ముందకు నడిచారు. ఆషామాషీగా ఆయన రంగంలోకి దిగలేదు…దిగిన తరవాత వెనుదిరిగి చూడలేదు. తెలంగాణ ఉద్యమంలో సాధించిన విజయంతో ప్రభుత్వాన్ని కూడా తను ఏర్పాటు చేస్తేనే సాధించుకున్న తెలంగాణ ఆకాంక్షలు సాకారం అవుతాయని భావించారు. అందుకే ఆయన వెంట ప్రజలు కూడా నమ్మకంగా నడిచారు.

ఇది కూడా చదవండి…25న నా పెళ్లి జైలు కెళ్లను… కోర్టులో రిమాండ్‌ ఖైదీ వీరంగం

ప్రజల నాడిని పట్టి..వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగడం.. రాజకీయాల కోసం ఎత్తులు పై ఎత్తులు వేయడం కెసిఆర్‌కు మాత్రమే తెలిసిన విద్య. జాతీయ రాజకీయాల్లో ఆయన ఉండి వుంటే ఈ పాటికి వేరుగా ఉండేది. కెసిఆర్‌కు దేశం విూద అవగాహన ఉంది. నదుల విూద..వాటి నడక విూదా అవగాహన ఉంది. అన్నింటికి మించి ప్రజల జీవన విధానంపై లోతైన అవగాహన ఉంది. ప్రపంచ గమనంపైనా అవగాహన ఉంది.

ప్రపంచ రాజకీయా లతో పాటు, దేశ రాజకీయాలను బాగా ఔపోసన పట్టిన వ్యక్తి. దేశంలో మోడీతో పోల్చుకుంటే కెసిఆర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయగల సత్తా ఉన్న నేత. దేశంలో ఉన్న వనరులు, వాటిని ఉపయోగించు కునే తీరు కూడా బాగా తెలిసిన వాడు.

తెలంగాణలో 24 గంట నిరంతర విద్యుత్‌ను ఇవ్వగలిగడంలోనే ఆయన దార్శనికతను అర్థం చేసుకోవచ్చు. నిరంతర విద్యుత్‌ ఉంటే చిన్న,పెద్దా పరిశ్రమల ఉత్పత్తి రంగం దెబ్బతినదని కూడా బాగా తెలుసు. అందుకే నిరంతర విద్యుత్‌ను సాకారం చేసిన నేత.. నిజానికి దేశ వ్యాప్తంగా నిరంతర విద్యుత్‌ ఎందుకు ఇవ్వలేక పోతున్నారో ఇప్పుడు ఆలోచన చేయాలి.

దేశంలో పారుతున్న నదులను కూడా ఎలా ఉపయోగించుకోవాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి కెసిఆర్‌. అందుకు గోదావరి జలాలను ఎదురెక్కించి రిజర్వాయర్లను కట్టించిన తీరు అద్బుతం కాక మరోటి కాదు. కాళేశ్వరంతో మొదలు పెట్టి..కొండపోచమ్మ సాగర్‌ వరకు నీటి రాకను చూస్తే అద్భుతం అని చెప్పని వారు ఉండరు. ఒక రాష్టాన్న్రి ఎలా అభివృద్ది చేయవచ్చో.. అన్నది కేవలం ఈ తొమ్మిదేళ్లలో చేసి చూపారు.

కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులను కట్టడం, చెరువులను పునరుద్దరించి గొలుసుకట్టు చెరువులకు ప్రాణం పోయడం, మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచినీరు సరఫరా చేయడం,హరితహారంతో పచ్చదనాన్ని పెంచి మొక్కల పెంపక ప్రాధాన్యాన్ని గుర్తించారు. జిల్లాల విభజనతో పాలనను ప్రజలకు చేరువ చేశారు. అన్నింటికి మించి యాదాద్రి ఆలయాన్ని నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో పునరుద్దరించి..కాకతీయకళావైభవాన్ని కళ్లకు చాటారు. ఇవన్నీకూడా విప్లవాత్మక నిర్ణయాలే.

ఇదే తరహాలో దేశ పగ్గాలు అందుకుంటే ఖచ్చింతంగా ఓ నాలుగైదేళ్లలో గణనీయమైన మార్పులు చూపి..ప్రజలకు ఆదర్శ నేతగా నిలిచే సత్తా కూడా కేవలం కెసిఆర్‌కు మాత్రమే ఉందనడంలో సందేహం లేదు. నిజానికి కెసిఆర్‌ బిజెపి లాంటి పార్టీలో ఉండివుంటే మోడీకి అవకాశం వచ్చేది కాదు. మోడీకి లేని విజన్‌ కెసిఆర్‌కు ఉందనడంలోనూ సందేహం లేదు.

ఇది కూడా చదవండి….కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం

మోడీది ప్రచార ..పటాటోపం తప్ప మరోటి కాదు….ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నేటికీ మోడీ పెద్దగా విజజయం సాధించలేదు. అందుకే రాజ్యాంగం కొత్తది రాసుకోవాలన్న కెసిఆర్‌ డిమాండ్‌ వెనక ప్రజల ఆకాంక్షలు బలంగా ఉన్నాయి. ప్రజల నాడిని పట్టిన నేతగానే కెసిఆర్‌ ఇలాంటి డిమాండ్‌ చేశారు. దీనిపై చర్చచేయకుండా కేవలం కెసిఆర్‌పై దుమ్మెత్తి పోస్తే కెసిఆర్‌కు పోయేదేవిూ లేదు.

కెసిఆర్‌ మాత్రమే దేశ రాజకీయాలపై దగ్గరగా అవగాహన కలిగి ఉన్నారు. దేశం పట్ల ఆయనకు ఓ స్పష్టమైన విజన్‌ ఉంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరిని ఎలా వాడుకోవాలో అన్న ప్రణాళికతోనే కార్యక్షేత్రం లోకి దిగారు. తెలంగాణ అసృాద్యం అన్నదానిని సుసాధ్యం చేసి చూపారు. జాతీయస్థాయిలో ఏయే రాజకీయ పార్టీతో నెయ్యం చేయాలో చేశారు.

ఎవరెవరిని మచ్చిక చేసుకోవాలో చేసుకున్నారు. ఇలా తెలంగాణను సాకారం చేయడంతో పాటు, పాలనలో తనదైన ముద్ర వేయగలిగారు. ఇప్పుడంతా విమర్శి స్తున్నట్లుగా కెసిఆర్‌పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేక కూడా లేదు. మెజార్టీ ప్రజలకు కెసిఆర్‌ అంటే కోపం కూడా లేదు.

రాజకీయ పార్టీల హడావిడి , విమర్శలు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇంతకుమించి చేయగలిగిన నేత ఇతర పార్టీల్లో లేరు.అంతెందుకు తెలంగాణలో కెసిఆర్‌ను మించిన విజినరీ నేత లేదనడంలో ఏమాత్రం అతిశయోక్తి కూడా లేదు. అందుకే నూరు కాదు..నూటి ఐదు సీట్లు గెలుస్తామన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. ఈ ధీమా వెనక కూడా బృహత్తర ప్రణాళిక దాగివుంటుంది. అదే సాకారం అవుతుందని మరోమారు మనం గమనించక తప్పదు.