Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

25న నా పెళ్లి జైలు కెళ్లను… కోర్టులో రిమాండ్‌ ఖైదీ వీరంగం

మహబూబాబాద్ బ్యూరో జూన్ 01 నిజం న్యూస్

హైదరాబాద్‌: కోర్టులో ఓ నిందితుడు హల్‌చల్‌ సృష్టించాడు. ఈనెల 25న తన పెళ్లి ఉందని.. జైలుకు వెళ్లనంటూ హంగామా చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలు పగులకొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి..

ఈ ఘటన గురువారం నాంపల్లి కోర్టులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆనంద్ అగర్వాల్‌ రౌడీ షీటర్. ఇప్పటికే అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అగర్వాల్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతనికి న్యాయస్థానం రిమాండ్‌ విధించింది.

Also read: కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం

ఈ సందర్భంగా తనకు పెళ్లి కుదిరిందని.. జైలుకు వెళ్లనని మొండికేశాడు. అంతటితో ఊరుకోకుండా కోర్టు లోపల డోర్‌ అద్దాలు ధ్వంసం చేశాడు. నిందితుడు అగర్వాల్‌పై గతంలోనూ పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదల అయ్యాడు..