Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం

బెంగళూరు: భారత వాయుసేనకు (IAF) చెందిన ఓ శిక్షణ విమానం (Kiran Aircraft) ప్రమాదానికి గురైంది. కర్ణాటక (Karnataka)లోని చామరాజనగర్‌ (Chamrajnagar) సమీపంలో అది కుప్పకూలింది..

అయితే, ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అందులో ఒక మహిళా పైలట్‌ ఉన్నారు. వాయుసేన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ

‘రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన ‘కిరణ్‌’ శ్రేణి విమానం.. బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయల్దేరింది. ఈ క్రమంలోనే చామరాజనగర్‌ సమీపంలోని భోగాపుర గ్రామంలో బహిరంగ ప్రదేశంలో అది కూలిపోయింది.

ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు.. భూమిక, తేజ్‌పాల్‌ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలోనే దీనిపై విచారణకు ఆదేశించిన’ట్లు వాయుసేన తెలిపింది..