Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ

ప్లాట్ ఫామ్ ట్రైన్ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ రెండు గంటలు నరకం

నిజం చెపుతాం జూన్ 01

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గురువారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది,రైలు ఎక్కుతుండగా ఓమహిళ జారిపడింది. ట్రైన్‌, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయింది. మధిరకు చెందిన రైల్వే ఉద్యోగి నాగేశ్వరరావు అతని భార్య కల్యాణి ఖమ్మంలోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చారు. ఆసుపత్రిలో చూపించుకున్న అనంతరం తిరిగి మధిర వెళ్ళడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

Also read: హైదరాబాదులో రేపటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు

ఇంటర్ సిటీ ట్రైన్ రావడముతో ముందు నాగేశ్వర రావు ఎక్కాడు. వెనుకనే భార్య కల్యాణి కూడా ట్రైన్ ఎక్కుతుండగా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో మహిళ కాలుజారి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కపోయి రెండు గంటలు నరకం అనుభవించింది,ఏడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.

దీనిని గమనించిన రైల్వే సిబ్బంది అతి కష్టం మీద మహిళను బయటకు తీసి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు…