Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సూచనను తిరస్కరించిన బిసిసిఐ

బీసీసీఐ గతంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సూచించిన హైబ్రిడ్‌ మోడల్‌ను తిరస్కరించింది.  ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్‌ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు సూచించిన హైబ్రిడ్‌ మోడల్‌ ప్రకారం పాకిస్తాన్‌ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వవొచ్చని,  భారత క్రికెట్‌ జట్టు ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికలో ఆడొచ్చని పేర్కొంది.

అంటే, బంగ్లాదేశ్‌, శ్రీలంక, దుబాయ్‌ లేదా పాకిస్తాన్‌కు బదులుగా ఏదైనా తటస్థ వేదికలో మ్యాచ్‌లను ఆడటానికి భారతదేశానికి అవకాశం ఉంది. అయితే బిసిసిఐ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సూచనను తిరస్కరించింది. దీంతో ఆసియా కప్‌ 2023 శ్రీలంకలో నిర్వహించవచ్చని వార్తలు  వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: ప్రదర్శన ఆధారంగానే క్రికెటర్లకు జీతాలు

ఆసియా కప్ నిర్వహణలో ఉన్న ప్రతిపాదనలు ఇవే..

మొదటి ప్రతిపాదన: ఆసియా కప్‌ టోర్నమెంట్‌ పాకిస్థాన్‌లో నిర్వహించాలి.  భారత జట్టు తటస్థ వేదికలో పాక్‌తో ఆడొచ్చు.

రెండవ ప్రతిపాదన: ఆసియా కప్‌ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఈ రౌండ్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు.

నిజానికి రెండో రౌండ్‌లో ఆయా టీంలతో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ తటస్థ వేదికపై జరుగుతుంది.