Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దుబారాను అరికట్టకపోతే మరింత భారం

తెలంగాణ ఏర్పడ్డ తరవాత గత దశాబ్ద కాలం పరిశీలిస్తే సిఎం కెసిఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశాయనే చెప్పాలి. అనేక సమస్యలకు పరిస్కారం చూపారు. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

9ఏళ్లు పూర్తయి దశాబ్దంలోకి వెళుతున్న తరుణంలో అనేకానేక కార్యక్రమాలు, వాటి ఫలితాలు మన కళ్లముందున్నాయి. ప్రధానంగా సాగునీటి రంగంలోనూ, విద్యుత్‌ రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడంతో మంచి ఫలితాలు వచ్చాయి.

అనేక సమస్యలు వెన్నాడుతున్నా.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత ప్రధాన సమస్యలకైనా పరిష్కారం దక్కింది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఆర్థిక పర మైన నిర్ణయాల్లో విచ్చలవిడి కారణంగా రాష్ట్రంలో మరిన్ని సమస్యలకు కారణమవు తోంది. ఈ సమస్యలపై కెసిఆర్‌ దృష్టి సారించాల్సి అవసరం ఉంది.

ఇక రైతు రుణమాఫీ అన్నది కూడా నిరంతరాయంగా కొనసా గించడం సరికాదు. రైతులకు కావాల్సింది మాఫీలు కాదు..పంటలు పండగానే కొనుగోలుచేసి వారు రోడ్డెక్క కుండా చేయగలగాలి. విత్తనాలు, ఎరువుల అందుబాటులో ఉంచాలి. ఏ పొలంలో ఏ పంట వేయాన్నది క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల ద్వారా చెప్పించాలి. అదేపనిగా వరి వేయడం కాకుండా డిమాండ్‌ ఉన్న పంటలను పండిరచేలా..వాటిని కొనుగోలు చేస్తామన్న భరోసాను రైతులకు కలిగించాలి.

మార్కెట్‌ యార్డులు, రైతు సంఘాలను బలోపేతం చేయాలి. రైతుబంధు సమితి నేతలు ఏనాడూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతుల సమస్యలపై ఆరా తీయడం లేదు. ఉత్సవ విగ్రహం లాంటి నేతలను పక్కన పెట్టాలి. అలాగే ఉచిత విద్యుత్‌పైనా నియంత్రణ ఉండాలి.

వ్యవసాయ మోటర్లకు విూటర్లు పెట్టి విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేయాలి. అలాగే వ్యవసాయానికి నిజంగానే ఎంత కరెంట్‌ అవసరమో అంతే ఉచితంగా ఇవ్వాలి. దుబారాకు కళ్లెం వేయకపోతే దాని ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. జూన్‌ 2న అవతరణ దినోత్సవాలు జరుపు కుంటున్న వేళ కఠిన నిర్ణయాలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్దికి ముందుకు సాగాలి.

వివిధ రంగాల్లో గట్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తెలంగాణ పురోగమనంలో కీలక అడుగులు పడ్డాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంబించిన అన్ని విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ పనులన్నీ వారు కోరుకుంటున్నవే. కెసిఆర్‌ పై ప్రజలు విశ్వాసాన్ని ఉంచి నందుకు అందుకు తగ్గట్లుగా హావిూలను నెరవేర్చే బాధ్యతలను చిత్తశుద్దితో అమలు చేయాలి.

తెలంగాణ కోటి రతనాల వీణగా భాసిల్లా లంటే అందుకు కావలసిన సంకల్పబలాన్న కెసిఆర్‌ సమృద్దిగా సమకూర్చు కున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో గతంలో మునుపెన్నడూ జరగని పనులు జరిగాయని చెప్పుకోవాలి. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటిని అందజేసే మిషన్‌ భగీరథ, చెరువులను పునరుద్ధరించి వాటిలో పుష్కలంగా నీళ్లు ఉండేటట్టు చూసే మిషన్‌ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్లు, 36లక్షల మందికి ఆసరా పథకం కింద పెన్షన్లు అందజేత వంటి వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా చేపట్టింది.

ఇది కూడా చదవండి: ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లాంటివి కూడా ఎన్నో ఉన్నాయి. అన్నింటికి మించి హరితహారం కార్యక్రమం తెలంగాణకు పెద్ద అసెట్‌ కానుంది. ఇది పక్కాగా అమలయితే పచ్చదనం వెల్లివిరుస్తుంది. ఉచిత విద్యుత్‌ పథకం మంచిదే అయినా సవిూక్షించుకుని పక్కాగా అమలు చేయాల్సి ఉంది.

ఎపిలో శ్రీకాకుళం జిల్లాలో విూటర్లు పెట్టడం మంచిపరిణామం. దీంతో 30శాతం విద్యుత్‌ ఆదా అయ్యింది. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ తరహా విధానం అమలు చేయడంతో మంచి ఫలితాలు రాబట్టారు. మరిన్నిజిల్లాల్లో విూటర్లు పెట్టడం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఉచిత విద్యుత్‌కు విఘాతం కలిగించకుండా విూటర్లు పెట్టి లెక్కించుకోవడం అన్నది
అకౌంట బులిటీని తెలియచేస్తుంది. ఇదే తరహాలో తెలంగాణలో విూటర్లు పెట్టి ఏ రైతులకు ఎంత పొలం ఉంది.. వారు ఏ పంటలు వేస్తున్నారో లెక్క తీయాలి. ఏపంటకు ఎంత విద్యుత్‌ అసవరమో అన్నది గుణించాలి. అన్నింటికి మించి పాతబస్తీలో అక్రంగా వాడుతున్న కరెంట్‌పై కన్నేయాలి. దీనిని అరికట్టకుంటే బిల్లులు కట్టేవారిపైనే భారం పడుతోంది.

ఇదే సందర్భంలో ఖజనాకు భారంగాను, ప్రజలకు భారంగానూ మారుతున్న పథకాలను సవిూక్షించు కోవడంలో తప్పులేదు. విద్యుత్‌ వాడకంపై నియంత్రణ లేకుంటే ఉచిత పథకాలు మెడకు చుట్టుకుంటాయి. ఇదే సందర్భంలో దుబారాను అరికట్టకపోతే మరింత భారం తప్పదు.

ఇది ఉభయ తెలుగు రాష్టాల్రకు వర్తిస్తుంది. ఇప్పటికే జీతాలకు, పెన్షన్లకు కష్టంగా మారింది. ఈ క్రమంలో పథకాలను సవిూక్షించుకుని కఠిన నిర్ణయాలతో ముందుకు సాగాలి. ప్రధానంగా జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రక ఘట్టంగా పేర్కొనాలి. స్వాతంత్య్ర వచ్చాక ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకున్న దాఖలాలు లేవు.

10 జిల్లాలు ఉన్న తెలంగాణను పాలనా వికేంద్రీకరణలో భాగంగా 33 జిల్లాలో చేశారు. దేశంలో ఇంతటి అరుదైన నిర్ణయం తెలంగాణలో మాత్రమే జరిగింది. ఆశలను కల్పించ డం వేరు.. వాటిని సాకారం చేయడం వేరు. తెలంగాణ కలను సాకారం చేసిన వ్యక్తిగా ధీరోదాత్త నాయకుడి గా కెసిఆర్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో హావిూని సాకారం చేసే దిశగా సిఎం కెసిఆర్‌ అడుగులు వేస్తున్నారు. ప్రజలు భాగస్వాములైతే తెలంగాణ పురోభివృద్ది లో కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: ఫీజుల పెంపు వీళ్ల ఇష్టారాజ్యమా??

ఇక మరో విశేషమేమంటే సమైక్య రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా రూపొందించిన అనేక పథకాలను, చట్టలాను మార్పు చేసుకుంటే తెలంగాణ అస్తిత్వానికి అనుగుణంగా సాగడం అన్నది కెసిఆర్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా చెప్పుకోవాలి.ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో కూడా తెలంగాణ ఓ వెలుగు వెలుగుతోంది.

దేశానికి ఈ పథకం ఆదర్శం కాబోతున్నది. పేదలు కూడా గౌరవంగా బతికేలా చేస్తున్న ఈ పథకం అందరి ప్రయోజనాలు నెరవేర్చ గలగాలి. రెండు పడకగదుల ఇళ్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. తమకూ అటువంటి ఇళ్లు రాబోతున్నయన్న ఆనందంలో ఉన్నారు.

అధికారులు, ఇదే సందర్భంలో గత ఎనిమిదేళ్లలో తీసుకున్న నిర్ణయాలను సవిూక్షించుకునే తరుణం ఇది. అనేక పథకాలు గుదిబండగా ఉన్నాయి. ఆర్థికంగా దెబ్బ తీస్తున్న పథకాలను సవిూక్షించు కోవాలి. లేకుంటా ఖజానాపై తీవ్ర ప్రభావం పడనుంది. అలాగే దండగ మారి పథకాలను సవిూక్షించుకోవాలి.

కిలో రూపాయి బియ్యం పథకం తక్షణం సవరించాలి. అలాగే రైతుబంధునుంచి అనర్హులను కూడా తొలగిం చాలి. పెన్షన్‌ స్కీమ్‌ను 60 ఏళ్లనుంచే మొదలు పెట్టేలా కొనసాగించాలి. అందులోనూ అనర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టాలి. లేకుంటే ఇవన్నీ కూడా ఖజానాపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ఇక గురుకులాల ఏర్పాటు కూడా ఓ విప్లవాత్మకమైన మలుపుగా చెప్పుకోవాలి. పేదలకు ఉచిత విద్యను అందించే క్రమంలో ఇదో అపురూపమైన ఘట్టంగా చెప్పుకోవాలి. చేపట్టిన పనిని చివరి వరకు వదలకుండా చేసే ధైర్యం, స్థయిర్యం ఉన్న సిఎంగా కెసిఆర్‌ సంస్కరణల్లోనూ ముందుండాలి.

ఈ సారి కూడా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. అందుకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పంటల కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు నష్టపోతున్నారు. ఇవన్నీ సవిూక్షించుకుంటేనే ప్రజలకు మేలు చేసిన వారు అవుతారు.