Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేటి నుంచి ఇంటర్ కళాశాలలు

తెలుగు రాష్ట్రాలలో మోగనున్న బడిగంట

జగిత్యాల మే 31(నిజం చెపుతాం )

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశంలోని మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వేసవి సెలవులు కొనసాగతున్నాయి.

పాఠశాలలకు జూన్ 12వ తేదీ వరకు సెలవులను ప్రకటించిన ప్రభుత్వం.. జూన్ 01వ తేదీ నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విద్యార్థులకు సందేశాలను పంపించాయి.

\ఇది కూడా చదవండి: అక్రమ మట్టి తవ్వకాలు…పట్టించుకోని రెవెన్యూ శాఖ

అయితే.. ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
అయితే.. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో.. ఈ సెలవులను పొడిగించే అవకాశాలు ఉంటాయనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది.

ఎండ తీవ్రత తగ్గి దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం చేశాయి.
దీంతో .. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

ఒక వేళ ఎండ వేడి తీవ్రంగా ఉంటే అప్పటి పరిస్థితుల ఆధారంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయా రాష్ట్రాల విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి…..