Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆర్ఓ ప్లాంట్ల శుద్ది పై ఇంత నిర్లక్ష్యమా?

*పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న (ఆర్ ఓ ప్లాంట్లు)
*ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం..
*నిబంధనలు పాటించని నిర్వాహకులు..

*అనుమతులు లేకుండా విక్రయాలు..
*పట్టించుకోని అధికార యంత్రాంగం..
చర్ల మే 31 (నిజం చెపుతాం(మండల పరిధిలో అనుమతి లేకుండా నీటి శుద్దీకరణ (ఆర్ ఓ ప్లాంట్ల) కేంద్రాలు విచ్చలవిడిగా వెళుస్తున్నాయి సరైన నిబంధనలు పాటించకుండానే నీటి సరఫరా చేస్తూ ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు

దీంతో వారి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయల గా సాగుతోంది. చర్ల కేంద్రంగా గతంలో ఒకటి రెండు వాటర్ ప్లాంట్లు ఉండేవి ఇప్పుడు అవి పదుల సంఖ్యలో వెలిశాయి నీటి శుద్ధి యంత్రాలను బోరు మోటార్లు కు జత చేసి ఇష్టాను రీతిన కెమికల్స్ కలిపి ఫిల్టర్ నీరంటు జనానికి అంటగడుతున్నారు

శుభ్రత. నాణ్యతలేని నీటిని సరఫరా చేస్తున్నారు అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు వాస్తవానికి నీటి స్వచ్ఛతను కొలిచే టిడీఎస్ (టోటల్ డిజాల్స్ సాలిడ్స్) దీని పరిమితి వెయ్యి వరకే ఇది దాటినా నీరు విషతుల్యం. ఈ నీరు తాగితే మూత్రపిండాలు పాడవడం జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం లాంటి ప్రమాదకర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యనిపునులు పేర్కొంటున్నారు

ఇది కూడా చదవండి : ఎక్కడి ధాన్యం అక్కడే …గోస పడుతున్న రైతు

ఈ ప్రమాదానాలకు ముఖ్య కారణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటవుతున్న నీటి శుద్ధీకరణ కేంద్రాలు. అనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి కొందరు వ్యాపారులు తమ ఇండ్లలోనే ఆర్ ఓ ప్లాంట్లుఏర్పాటు చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి నీటిని అమ్ముతున్నారనేది జగమెరిగిన సత్యం.

డబ్బు సంపాదనే ధ్యేయంగా ఆర్వో ప్లాంట్లు నడుపుతున్న నిర్వాకులు విచ్చలవిడిగా బోరు మోటర్లను వినియోగిస్తూ రివర్స్ ఆస్మొసిన్ పద్ధతిలో జలాలను శుభ్రం పరుస్తూ జనాలకు విక్రయిస్తున్నారేతప్ప టిడిఎస్ ఏమేర ఉపయోగించాలనే దానిని గాలికి వదిలేస్తున్నారు. మరికొందరు డొమెస్టిక్ పర్పస్ లో వేసిన బోర్లను కమర్షియల్ గా వినియోగిస్తూ ఒక క్యాన్ 20 నుంచి 30 వరకు అమ్ముతున్నారు చాలావరకు ఆర్వో ప్లాంట్లు అన్ని ఈ విధంగానే సాగుతున్నాయి

ఎంత కాలం ప్రజలకు హాని కలిగించే ఆర్ ఓ ప్లాంట్లఏర్పాటు పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి
*తనిఖీలు చేపట్టని అధికారులు..
వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కన్నెత్తి చూసే నాధుడే కరువయ్యాడని ఆరోపణలు ఉన్నాయి కెమికల్స్ వినియోగం నీటి శుద్ధి చేసే విధానం నీటిని నిల్వ చేసే ట్యాంకుల పరిశుభ్రతపై నిరంతరం నిఘా ఉండాల్సిన అధికారులు ఈ ఊసే మరిచారు దీంతో నిర్వాహకులు తమ ఇష్టాసారంగా వాటర్ ప్లాంట్లను నడుపుతూ ప్రజల నుండి డబ్బులు దండుకుంటున్నారు

మండలంలో గతం మూడు సంవత్సరాలుగా వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేపట్టిన దాఖలాలు లేవు స్థానిక అధికారుల సైతం వాటివైపు చూడటం మరిచి పోయారు .

ఇలాంటి పరిశుభ్రత లేని నీరు తాగడం వలన మండల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఇకపైన అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాటర్ ప్లాంట్ల నిర్వహణపై నిఘా పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు