Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎక్కడి ధాన్యం అక్కడే …గోస పడుతున్న రైతు

కరువైన లారీలు కదలని ధాన్యం
నెల రోజులు గడుస్తున్నాం కదలని ధాన్యం
మా గోస ఎవరికి ఎవరికి చెప్పుకోవాలని రైతు ఆవేదన

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో మే 31
(నిజం చెపుతాం)
రైతే రాజు రైతే రాజు అని రైతుని నట్టేట ముంచుతున్నారు ఆరుంగాలాలు పండించిన చేతికొచ్చిన పంటని అమ్ముకోలేక తినలేక కళ్ళల్లో కుప్పలు పోసి లారీల కోసం ఎదురుచూస్తున్న రైతుల గోస నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల్ కాల్వ గ్రామంలో ఎక్కడ పోసిన కుప్పలు అక్కడే ఉన్నాయి

వరి ధాన్యం కళ్ళల్లో పోసి ఒక నెల అయినా కూడా ధాన్యం కదలేకపోయేసరికి రైతు కంట్లో కన్నీరు పుడుతుంది వారి కోతలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం రెండు లారీలు మాత్రమే రావడం జరిగిందని రైతులు ఆగ్రానికి వ్యక్తమై ఒకపక్క వర్షాలు పడటంతో మరోపక్క లారీల కొదువతో రైతు ఏం చేయాలని పడ్డాడు

ఇది కూడా చదవండి : బాసరలో భక్తుల రద్దీ

అందుకే ఈరోజు రైతు కన్నెర్ర చేసి ఈరోజు రైతులు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది

ఈ కార్యక్రమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎంబడి రాజేశ్వర్ మద్దతు తెలిపి రైతులకు న్యాయం జరపాలని తెలిపారు

అదేవిధంగా మంత్రి అలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడే మాటలు సరికావని పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు గత ఏడాది రైతులు వడ్లని కళ్ళలోకి తీసుకొచ్చి అక్కడ పోస్తే పిఎసిహెచ్ ద్వారా రిసిప్ట్ ఇస్తే రైతుల హాయిగా ఇంట్లో నిద్ర పోయే వాళ్ళని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు

మరి అదే విధంగా ఈ సంవత్సరం ఎందుకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సిర్గాపూర్ గ్రామంలో నేషనల్ హైవే రోడ్డుపై ధర్నా నిర్వహించగా. దాదాపు అరగంట వరకు తెలంగాణ ప్రభుత్వం పై రైతులు కన్యరాజ్యేయడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి

ముందస్తు సమాచారం మేరకు ఎస్సై గంగాధర్ సిర్గాపూర్ చేరుకొని రైతులకు అచ్చ చెప్పడంతో ఆందోళన విరమించుకుని రైతులు శాంతించారు