Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాసరలో భక్తుల రద్దీ

ముధోల్ నియోజకవర్గ ప్రతినిధి ,మే31 (నిజం చెపుతాం)

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో బుధవారం భక్తుల అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కోరిన కొర్కెలు తీర్చే అమ్మవారిగా సరస్వతి అమ్మవారికి పేరుంది.

ఇక్కడ పిల్లలకు విద్యకు సంబంధించిన లెటర్లను పలక మీద రాపిస్తే మంచి చదువు వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ దేవాలయంలో పూజలు చేయించితే మంచిదని నమ్ముతారు.

ఇది కూడా చదవండి : ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలతో తెలంగాణ దేశంలో కొత్త రికార్డు

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, వేసవి సెలవులు ముగుస్తుండంతో ఉదయం నుండి భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మ వారి దివ్య దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు.

భక్తులు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో దేవాలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలను తీసుకున్నారు.