Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలతో తెలంగాణ దేశంలో కొత్త రికార్డు

దేశంలోనే అత్యధిక ప్రసవాలు జరిగిన ప్రభుత్వ ఆసుపత్రిగా తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రి చరిత్ర సృష్టించింది.

సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, జోగులాంబ గద్వాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80% ప్రసవాలు చేయగా,

16 జిల్లాల్లో 70% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యాయి.

ఏప్రిల్‌లో సగటున 69% ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలతో తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది.

ALSO READ : ఎమ్మెల్యే అభ్యర్థిని నేనంటే నేనే..?

2014లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉండగా, 2022-23లో అది రెట్టింపు గా 62 శాతానికి చేరుకుంది.

సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఆరోగ్యతెలంగాణలో భాగంగా అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలకు ఇది నిదర్శనమని, ఆరోగ్య శాఖకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు.  అదే స్ఫూర్తితో తమ పనిని కొనసాగించాలని  ఆయన కోరారు.