Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్యే అభ్యర్థిని నేనంటే నేనే..?

జమ్మికుంట ( నిజం చెపుతాం న్యూస్)

హుజరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ రసవత్తరంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి సీనియర్ నాయకులు ఎవరికి వారే కాబోయే ఎమ్మెల్యే మేమే అని ప్రచారం చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో భా రా స, బి జె పి, కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల సీనియర్ నాయకులు ఎవరికి వారే టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ మూడు పార్టీలలో నుండి సీనియర్ నాయకులు ఏ పార్టీకి మారుతారో తెలియని సందిగ్ధంలో ఉన్నారు అని సమాచారం.

హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్టు పాడి కౌశిక్ రెడ్డి కె అని కేటీఆర్ జమ్మికుంట సభ లో ప్రకటించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ కొన్ని రోజుల నుండి పార్టీలో అంతర్గత విభేదాల వలన సోషల్ మీడియాలో ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాబోయే ఎమ్మెల్యే అని ప్రచారం చేస్తున్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ విలేకర్ల సమావేశంలో కెసిఆర్ నాకు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఈటెల రాజేందర్ పై నేను పోటీ చేస్తానని ప్రకటించాడు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డి గ్రూప్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రూప్ లు అని రెండు గ్రూప్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు దగ్గర కావడానికి అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నాడు. గెల్లు శ్రీనివాస్ సతీమణి వివాహాలకు, శుభకార్యాలకు ఇంటింటా నియోజకవర్గంలో ప్రజలకు అవుతున్నారు.

బిజెపి పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కే టిక్కెట్టు వస్తుంది కానీ , ఎన్నికల వరకు ఏమి జరుగుతుందో ఈటెల బిజెపిలో ఉంటాడా లేక పార్టీ పెడతాడా అని సమాచారం.

కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూరి వెంకట్ ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఇప్పుడు పార్టీలో సీనియర్ నాయకులకు జూనియర్ నాయకుల మధ్య అంతర్గత విభేదాల వలన ఎవరు సీటు ఆశిస్తున్నారో తెలియక పార్టీ లో కార్యకర్తలు అందోళన చెందుతున్నారు.

Also read: పుష్ప- 2 ఆర్టిస్టులకు తప్పిన ప్రమాదం

ఏది ఏమైనా గాని ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పార్టీలు మారే వారు ఎంతమంది ఉంటారో అని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు.