ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడానికి భారత్‌కు అదే ఆటంకం
జూన్ 7-11 వరకు ఓవల్‌లో జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఓడిన తర్వాత భారత్ టైటిల్‌ను గెలుచుకోవాలని చూస్తోంది.
భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడానికి భారత్‌కు పెద్ద ఆటంకం ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు.
WTC ఫైనల్ ఆడే జట్టులో ఛెతేశ్వర్ పుజారా తప్ప మిగిలిన భారతీయ ఆటగాళ్లందరూ IPL 2023లో ఆడారు.
ALSO READ: డబ్ల్యూటీసీ ఫైనల్ లో అతడే కీలకం
T20 ఆలోచనా విధానం నుండి బయటపడడమే భారత జట్టు సభ్యులందరికీ అతిపెద్ద సవాలని, టెస్ట్ ఫార్మాట్‌లో ఆడేందుకు సర్దుబాటు చేసుకోవడం కష్టంగా మారే అవకాశం ఉందని తెలిపాడు.
ఇంగ్లీష్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా మాత్రమే టెస్ట్ గేమ్ కు టచ్ లో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడిన ఏకైక వ్యక్తి అతనే అవుతాడు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వారికి పెద్ద సవాలు అవుతుంది, ”అని ఒక గవాస్కర్ అన్నారు.