Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిఘా నేత్రానికి ఫ్లెక్సీ అడ్డు

రక్షణ కల్పించే నిఘా నెత్రానికే కరువైన రక్షణ

జుక్కల్ నియోజకవర్గ ప్రతినిధి మే 30 నిజం చెబుతాం న్యూస్

ఏవైనా దొంగతనాలు కానీ ప్రమాదాలు కానీ జరిగినప్పుడు ఎలా జరిగిందో తెలియనప్పుడు వెంటనే మనకు గుర్తుకు వచ్చేది నిఘా నేత్రం (సీసీ కెమెరా). కానీ అలాంటి నిఘా నెత్రానికే రక్షణ కరువైంది.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని పాత బస్టాండ్ కూడలిలో ఉన్నటువంటి సీసీ కెమెరా కూడా ఇలాంటిదే.

పోలీసులు నిఘా వ్యవస్థ పటిష్టత కొరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లను కొన్ని రాజకీయ పార్టీ లు తమ ప్రచారాల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను సీసీ కెమెరాలకు అడ్డుగా ఏర్పాటు చేయడంతో ఆ కూడలి వద్ద ఎటువంటి సంఘటన జరిగిన సమాచారం తెలియకుండా పోయింది.

ALSO READ: నేల ఆరోగ్య పరిరక్షణ పర్యావరణానికి మేలు

ఇటీవల గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీ కి గురైన సమయంలోకూడా ఫ్లెక్సీ అడ్డుగా ఉండటం తో ఎలా జరిగింది అన్న విషయం పై సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చాలా రోజుల నుండి ఫ్లెక్సీ సీసీ కెమెరా కు అడ్డుగా ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు చూసిచూడనట్టు ఉండటం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.