Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేల ఆరోగ్య పరిరక్షణ పర్యావరణానికి మేలు

నేల ఆరోగ్య పరిరక్షణ అందరి భాద్యత

పెన్ పహాడ్ ప్రతినిధి మే 30 నిజం న్యూస్

శ్రీ అరబిందో కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి నేల ఆరోగ్య పరిరక్షణ పర్యావరణకు మేలు అనే అవగహణ కార్యక్రమం మే మూడో వారం నుండి జూన్ 5 వరకు నిర్వహించునట్లు కే.వి.కే- గడ్డిపల్లి మృత్తిక శాస్త్రవేత్త ఏ.కిరణ్ తెలిపారు.

ఈకార్యక్రమంలో భాగంగా పెన్ పహాడ్ మండల పరిధిలోగల సింగారెడ్డి పాలెంలో మంగళవారం మట్టి నమూనా సేకరించే విధానం, వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగం గురించి తెలిపారు,

రైతులు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుంది.

ALSO READ: నూతన దేవాలయంలో మహా యజ్ఞం

అదేవిధంగా భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చును,

పచ్చిరొట్ట ఎరువులు ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతుల్లో భూసారాన్ని పెంచే పద్ధతులు తదితర విషయాలను వివరించారు అనంతరం మట్టి నమూనా సేకరించే విధానాన్ని రైతులకు చూపించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త సి.హెచ్.నరేష్ కూరగాయల పంటల యొక్క యజమాన్య పద్ధతులపై రైతులకు వివరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో రైతులు కే. వెంకన్న, పి.చంద్రశేఖర్, కే. కోటయ్య, కే. ఎల్లయ్య, వై. సైదులు తదితరులు పాల్గొన్నారు.