Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నూతన దేవాలయంలో మహా యజ్ఞం

పెన్ పహాడ్ ప్రతినిధి మే 30 నిజం న్యూస్

మండల పరిధిలోని ధూపహాడ్ గ్రామంలో శ్రీ శ్రీ సీతారామచంద్ర పరమేశ్వర దుర్గామాత నూతన దేవాలయంలో మూడు రోజులు జరగవలసిన పూజా కార్యక్రమాలలో

మొదటిరోజు మంగళవారం గణపతి పూజ పుణ్యవచనం వాస్తు పూజ వాస్తు హోమం వాస్తు పరిషత్మీకరణ పంచగవ్య అగ్ని మధనం మౌళి మల్లాది హోమం అష్టసితి హోమం పీఠ పూజలు సర్వతోభద్ర వంటపం వాహన యోగం పూజ తీర్థ ప్రసాద వినియోగం వేద పండితులు శ్రీమాన్ బొర్రా వాసుదేవా చార్యులు ముత్తారం ఇటువంటి రామయ్య శర్మ నరేందర్ శర్మ ఆధ్వర్యంలో జరిగినది.

ALSO READ: కూలి పడదు… పైకం జమ కాదు

31 వ తారీఖున దేవతామూర్తులు గ్రామములో పురవీధులలో ఊరేగింపుగా జలబిందలచే జలాభిషేకం జరుగుతుందని జూన్ 1వ తారీఖున 810 నిమిషములకు ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని వేద పండితులు తెలిపినారు

ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ దేవాలయ నిర్మాణ కర్త బిట్టు నాగేశ్వరరావు శ్రీరామ మాలాదరణ స్వాములు గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు