Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కూలి పడదు… పైకం జమ కాదు

*పనులు లేక ఉపాధీ పనికొస్తున్నాం.
*పేదల పధకంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ` వ్యకాస నేత నాగేశ్వరరావు
కారేపల్లి,మే30 (నిజం చెపుతాం):ఉపాధీ హామీ పనిలో కూలి పడటం లేదు. చేసిన పనికి పైకం ఖాతాల్లో జమ కావటం లేదు ఉపాధీ హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారేపల్లి మండలం కారేపల్లి, ఉసిరికాయలపల్లి గ్రామాల్లో ఉపాధీ పనుల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే నిర్వహించారు.

ఈసంధర్బంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రమ ఎక్కువ కూలి తక్కువగా ఉపాధీ పనుల్లో వస్తుందని కూలీలు తెలిపారు. ఎంత పడుతుందో పేస్లిప్పులు లేవు. పైకం ఎప్పుడు పడుతుందో తెలియటం లేదన్నారు. పని ముట్లు ఇవ్వటం, పనిముట్ల పదును పెట్టటానికి ఇచ్చే పైకం మరిచిపోయారని వ్యకాస బృందానికి కూలీలు తెలిపారు.

ALSO READ: జోరుగా అక్రమ నిర్మాణాలు

కూలే పడని పనికి రెండు పూటలు పని చేయాలంటా, పనులు లేక బ్రతుకు దెరువు కోసం ఉపాదీ óపనికి వస్తున్నామని పేదలు ఆవేదన వెలిబుచ్చారు. ఈసందర్బంగా వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాశ్వరరావు మాట్లాడుతూ పేదలకు ఉపాధీ చూపే ఈజీఎస్‌పై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.

పనులు కల్పించక, కూలి పైకం ఇవ్వకుండా ఈజీఎస్‌ను పేదలకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని పేదలందరు తిప్పికోట్టాలని, వ్యకాస ఆధ్వర్యంలో ఉపాధీ హామీ పధకం రక్షణ పోరాటాల్లో పాలు పంచుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఉసిరికాయలపల్లి సర్పంచ్‌ బానోత్‌ బన్సీలాల్‌, వ్యకాస నాయకులు తేజావత్‌ చందర్‌, వెంకన్న, బద్దె రాధమ్మ, కూలీలు పెద్దమ్మ సత్యనారాయణ, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.