Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జోరుగా అక్రమ నిర్మాణాలు

ఆకాశమే హద్దుగా జోరుగా అక్రమ నిర్మాణాలు…

గాజులరామారం సర్కిల్ 26 లో వెలుస్తున్న నిర్మాణాలు.

అవకాశమే ముఖ్యంగా అక్రమార్జన..

అక్రమ సంపాదన మత్తులో మునిగి తేలుతున్న సెక్షన్ అధికారి నరేష్…

ఆదాయాన్ని మించి ఆస్తులు కూడ పెట్టిన నరేష్..

కుత్బుల్లాపూర్ : మే 30 (నిజం చెబుతాం) అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీస్ గత కొద్ది కాలంలోనే ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అనతి కాలంలోనే ఒక సెక్షన్ ఆఫీసర్ గా అన్ని ఆస్తులు ఎట్లా వచ్చాయని నోరేళ్ల పెడుతున్నారు.

అది గాజులరామారం సర్కిల్ 26 పరిధి గత కొంతకాలంగా శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వానికి చేరవలసిన పన్నులు ఒక వ్యక్తికి చేరడం హాస్యాస్పదం. షిరిడి హిల్స్ ప్రాంతంలో సెక్షన్ ఆఫీసర్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, భవన నిర్మాణ యజమానులు దగ్గర లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఒక్కో అంతస్తుకు ఒక్కో రేటు. పైసలు పెట్టు… ఫ్లోర్లు పెంచు అన్న తీరుగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇదిలా ఉండగా రాజకీయ నాయకుల అడుగులకు మడుగులు వత్తెలా వ్యవహరిస్తుండడం దిగజారుడుతనంగా ఉందని ప్రజలు ఆక్షేపిస్తున్నారు.

ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి ప్రజల తరఫున పనిచేయాల్సి ఉండగా, కొంతమంది నాయకుల అండదండలతో అక్రమార్చన చేస్తున్నట్లు బట్టబయలవుతోంది. జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయానికి ఎవరైనా భవన నిర్మాణానికి పర్మిషన్ కోసం వస్తే.. అక్కరలేదు నేనున్నానంటూ ప్రోత్సహిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారుల్ని నిలవరించి ఎవరూ అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ALSO READ: బిల్డింగ్ కోడ్ 2016 అమలు చేయాలి

ప్రభుత్వ అధికారులు ఎంతోమంది ఉన్నతంగా ప్రజల మేలుకోరి పనిచేస్తున్నారు. కానీ ఇలాంటి అవినీతి అధికారి వలన వ్యవస్థకే మైల అంటుకుంటుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులపైనే ప్రజల్లో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంది. ప్రజల కోసం ప్రజల తరఫున పనిచేస్తామని, బాధ్యతలు తీసుకుంటున్న అధికారులు, నాయకులు ప్రజల తరపున ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జలగల్లాగా ప్రజలను డబ్బు కోసం పీక్కుతినొద్దని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జరుగుతున్న తతంగంపై లోతుగా అన్వేషించి అవినీతి అధికారి నరేష్ పై చట్టపర చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల కోరుతున్నారు.