Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిల్డింగ్ కోడ్ 2016 అమలు చేయాలి

బిల్డింగ్ కోడ్ 2016 అమలు చేయాలంటూ వినతిపత్రం.

విచ్చలవిడిగా పెరుగుతున్న అంతస్తులను కట్టడి చేయాలని వినతి.

కూకట్ పల్లి మే 30 (నిజం చెబుతాం)

తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్మెంట్ లు ఆకాశం హర్మ్యాలు రోజు రోజుకు పెరిగి పోతున్న క్రమంలో, భవన నిర్మాణాలలో నాణ్యత దృష్ట్యా, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 అమలు ఆవశ్యకత ఉన్నదని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డా. పల్లెపాడు దామోదర్ అన్నారు.

మంగళవారం వినియోగదారుల రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, పల్లెపాడు దామోదర్, కాసు విశ్వోధర్ రాజు, పి, వినయ్ చంద్ర లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ కె.వి.రావు, సీనియర్ సైంటిస్ట్ టి. రాకేష్ ను కలిసి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో నిర్మాణం జరుగుతున్న 20 నుండి 35 అంతస్తుల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాల కొరకు నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ఆవశ్యకత ను తెలుపుతూ, అమలు చేయాలని కోరారు.

ALSO READ: తూకాల్లో మోసాలు చేస్తే కేసు నమోదు

నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 అమలు వలన వినియోగదారులకు పూర్తి రక్షణ ఏర్పడుతుందని బి.ఐ.యస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీసర్ కె.వి.రావు పేర్కొంటూ, సత్వరమే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

మొదటగా వినియోగదారుల ప్రతినిధులు, బిల్డర్ లతో కలిసి అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.