Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తూకాల్లో మోసాలు చేస్తే కేసు నమోదు

వినియోగదారులను మోసం చేస్తే చర్యలు తప్పవు
– జిల్లా తూనికలు,కొలతల శాఖ అధికారి విజయ్ కుమార్

మహబూబాబాద్ తొర్రూర్ మే 30(నిజం చెప్పాతాం)

వినియోగదారులను తునికలు, కొలతలు తదితర విషయాల్లో మోసం చేస్తే చర్యలు తప్పవని జిల్లా తునికలు,కొలతల శాఖ అధికారి విజయ్ కుమార్ అన్నారు.

మంగళవారం డివిజన్ కేంద్రంలోని రిలయన్స్ మార్ట్,బేకరీలు, ఎలక్ట్రానిక్,ఫర్టిలైజర్స్,శానిటరీ షాపులలో జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్చార్జి వింజమూరి సుధాకర్ తో కలిసి తనిఖీలు చేపట్టారు.

ALSO READ: ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన మల్యాల గ్రామ రైతులు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులను వివిధ షాపుల నిర్వాహకులు మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని షాపులను సీజ్ చేస్తామన్నారు.

సాయి అయ్యంగార్ బేకరీ,రాందేవ్, మహాదేవ్ ఎలక్ట్రికల్ షాపులలో గడువు ముగిసిన వస్తువులను అమ్మడంతో వారిపై రూ. 20 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

తూకాల్లో మోసాలు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.