ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కిన మల్యాల గ్రామ రైతులు
చందుర్తి, మే 31( నిజం న్యూస్):
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ మండలంలోని మల్యాల గ్రామ రైతులు వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి మంగళవారం ధర్నా చేశారు.
రోహిణి కార్తె నడుస్తున్నందున రైతులందరూ తదుపరి పంటలకు సిద్ధమవుతున్న తరుణంలో నేటికీ కొనుగోలు జాప్యం అవుతున్నాయని, అకాల వర్షాలతో తాము అనేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు.
తూకం వేసిన ధాన్యాన్ని సైతం తరలించడంలో ఆలస్యం జరుగుతోందని, రైతులను మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, రైతు పక్షపాతి రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ఆవేదన అరణ్య అరోదన అవుతుందని అన్నారు.
ALSO READ: గుండె, మూత్ర పిండాల వ్యాధులను తగ్గించే అంజీర
కలెక్టర్ మరియు ఎమ్మార్వో రావాలని భీష్ముంచుకు కూర్చున్న రైతులను స్థానిక ఎస్సై జిల్లెల్ల రమేష్ నచ్చజెప్పి ధర్నా విరమింప చేశారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. రైతుల ధర్నాతో రోడ్డుపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది.
ఇట్టి ధర్నాలో గ్రామ రైతులు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.