గుండె, మూత్ర పిండాల వ్యాధులను తగ్గించే అంజీర
అంజీర ఫలాలు అందరికీ తెలిసినవే. ఇవి గుండె, కాలేయ, మూత్ర పిండాల వ్యాధులను తగ్గించే మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఈ చెట్టును మంజుల అని కూడా పిలుస్తారు. దీనిలో ఫలాలు, వేరు, బెరడు ఔషధంగా పనికి వస్తాయి.
అంజీర ఎండిన ఫండ్లను ప్రతీ రోజూ రెండు మూడు పండ్లను తిన్న నీరసం తగ్గిపోయి హుషారుగా ఉంటారు. ఇంకా తెల్లబట్ట, మూత్రంలో చీము, మంట, రక్త హీనత, గొంతు నొప్పి, కంఠ రోగాలు తగ్గి పోతాయని తెలుస్తుంది.
వాడే విధానం…
నిస్సత్తువ తగ్గి పోయి…
రెండు మూడు ఎండిన అంజీర పండ్లను ఒక రాత్రి నీటిలో నానబెట్టి మరుసటి ఉదయం ఆ పండ్లను నమిలి మింగి ఆ నీటిని తాగిన శరీరమునకు అధిక బలం వచ్చును. మహిళలు ప్రతీ రోజూ తీసుకున్న పని భారం వలన కలిగే నీరసం తగ్గి శరీరము తేలికగా అవుతుంది.
తెల్లబట్ట తగ్గును…
వేరు బెరడును మెత్తగా దంచి ఒక గ్లాసు నీటి యందు మరగ కాచి వడపోసి 30 మిలీ చొప్పున పరగడుపున ఒక వారం పాటు త్రాగిన తగ్గును.
మూత్రములో మంట, చీము …
పక్వానికి వచ్చిన పండ్లను నీడన ఎండబెట్టి చూర్ణం చేసి తేనెలో ముద్దగా పిసికి తింటే మూత్రములో మంట, చీము తగ్గును.
రక్తహీనత (ఎనిమియా)…
1 నుండి 3ఎండిన పండ్లను రోజుకు ఒక సారి తింటే రక్తం పెరుగుతుంది. చలువ చేస్తుంది.
గుండె, మూత్ర పిండములు, కాలేయములకు సంబంధించిన రోగాల కోసం…
ఈ వ్యాధులు ఉన్న వారు ఈ పండును రోజూ తింటుంటే ఆరోగ్యం మెరుగయ్యే అవకాశం ఉంది.
గొంతు నొప్పి, కంట రోగాలకు…
ఎండిన పండ్లను నమిలి మింగుతున్న గొంతు నొప్పి తగ్గుతుంది. కంఠ రోగాలు కూడా నయం అవుతాయి.
ALSO READ: ఈ దుంపతో రెండు నెలల్లో అర్షమొలలు మాయం