ఈ దుంపతో రెండు నెలల్లో అర్షమొలలు మాయం
అడవి కంద ఇది భూమిలో దొరుకుతుంది. దీనిని వజ్రకంట, వనసూరణ, కనకకంద అని పిలుస్తారు.
దీనిలో దుంప, కంద ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. అడవి కందను ఉపయోగించి అర్షమొలలు, విరిగిన ఎముకలను అతికించడం, గడ్డలను తగ్గించడం, బోదకాలు, కొవ్వు కంతులను తగ్గిస్తారు. వీర్యపుష్టి, శీఘ్రస్కలనం, పులిపిర్లు, కీళ్ల వాపులను నయం చేయడానికి వాడతారు.
ALSO READ: శ్వాస కోశ వ్యాధులకు ఉత్తమ ఔషధమీ మొక్క
వాడే విధానం….
అర్షమొలలు…
దుంపను ఎండించి పొడిగా చేసి సమానంగా బెల్లం కలిపి 10 గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుంటే, దుంపను కూరగా వండి అన్నంలో తీసుకుంటే ఒకటి రెండు నెలల్లో మొలలు తగ్గిపోయి సుఖ విరేచనం అవుతుంది.
ఎముకలు విరుగుట…..
పచ్చి దుంపను నూరి, నిమ్మ రసంతో కలిపి విరిగిన భాగంపై కట్టు కట్టిన అవి అతుక్కుంటాయి.
గడ్డలను తగ్గించుట కొరకు…
అడవి కంద దుంపను నిప్పులలో జాగ్రత్తగా కాల్చి బెల్లంతో కలిపి మెత్తగా నూరి పైకి లేపనం చేస్తే గడ్డలు తగ్గిపోతాయి.
బోదకాలు నివారణకు…
అడవి కంద దుపంను నీళ్లలో నూరి తేేనె, నెయ్యి కలిపి పట్టించుచున్న బోదకాలు తగ్గును.
కొవ్వు కంతుల తగ్గించడానికి…..
బాగా పండిన అడవి కంద దుంపను నీళ్లలో నూరి శొంఠి కలిపి 1 నుండి రెండు వారాలు పాటు పలుమార్లు లేపనం చేసిన కొవ్వు కంతులు తగ్గిపోతాయి.
వీర్యపుష్టి, శీఘ్రస్కలనం పోవడానికి….
ఎండిన దుంప చూర్ణమునకు సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి తీసుకున్న క్రమంగా వీర్య పుష్టి కలుగును. శీఘ్ర స్కలనం తగ్గిపోతుంది. మంచి బలవర్ధకం
పులిపిర్లు…..
దుంప ముక్కను పులిపిర్లపై నిత్యం రుద్దిన పులిపిర్లు తగ్గిపోతాయి.
కీళ్ల వాపు నయం…
దుపంను మొత్తగా నూరి వెచ్చ చేసి నొప్పి భాగంలో కట్టు కట్టిన వాపుతో కూడి ఉండు కీళ్ల పోట్లు తగ్గుతాయి.