Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉద్యోగాల పేరిట యువతను మోసగిస్తున్న ముఠా అరెస్టు

జగిత్యాల మే 30(నిజం చెపుతాం )

నిరుద్యోగులైన అమాయక యువతకు ఉద్యోగాల పేరిట గాలం వేసి వారి వద్ద నుండి  లక్షల రూపాయలు దండుకుంటూ ఆపై ముఖం చాటేసి, యువతను నిలువునా ముంచి, ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను మంగళవారం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసి కటకటాలు పాలు చేయడం జరిగింది.
మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి చెందిన మందల భాస్కర్ పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన గంగారపు మధుమూర్తి చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం మరియు మరో ఇద్దరితో కలిసి ఒక ముఠాగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగ యువకుల కు ఉద్యోగం ఇప్పిస్తానని వారి వద్ద లక్షలు లక్షలు వసూలు చేసుకుంటూ… ముఖం చాటేసి వారిని ముంచడం చేస్తున్నారు.

ALSO READ: మైనర్‌ బాలికను అతి కిరాతకంగా….
నష్టపోయిన బాధితుడు ఫిర్యాదు…..

ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ శ్రీ నటేష్….. నిందితుల ముఠాను అరెస్టు చేయుటకు వారి కదలికలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకునుటకు ఒక ప్రత్యేక బృందాన్ని ఎస్సై రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ ప్రత్యేక బృందం నిందితుల కదలికలపై నిఘా ఉంచి వారిని ఈరోజు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వారు తమ నేరాన్ని అంగీకరించడంతో పాటు గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నామని తెలియజేసినారు. వారి వద్ద నుండి 93 వేల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అరెస్టు చేసిన నిందితులు కోర్టులో హాజరు పరిచి వీరు ఇంకా ఎంతమందిని మోసం చేసినారని ఎంత మంది వద్ద ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసినారు అనే విషయంపై లోతుగా విచారణ చేసి తదుపరిచర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది.