మైనర్ బాలికను అతి కిరాతకంగా….
నిజం న్యూస్ మే 30
ఢిల్లీ(Delhi)లో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. ఓ యువకుడు పదునైన కత్తితో 16ఏళ్ల మైనర్ (16Years Girl)బాలికను విచక్షారహితంగా గాయపర్చడమే కాకుండా ఆమె చనిపోయిన తర్వాత తలపై బండరాయితో మోది చిద్రం చేసిన ఘటన పూర్తిగా సీసీ కెమెరా(CC camera)లో రికార్డైంది
Also read: నేడు డయల్ యువర్ డిఎం కార్యక్రమం
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన యువకుడు సాహిల్ సర్ఫరాజ్(Sahil Sarfaraz)ను పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఢిల్లీ నార్త్-వెస్ట్ ఢిల్లీలోని షహబాద్ డెయిరీ(Shahabad Dairy) ప్రాంతంలో హింసాత్మక ఘటన జరిగింది. ఓ పిచ్చి ప్రేమికుడి ఉన్మాదానికి కేవలం 30సెకన్లలో బాలిక మృతి చెందడం అందర్ని భయపెడుతోంది.
*ఢిల్లీలో మైనర్ హత్య*..
దేశరాజధానిలో మరో ప్రేమోన్మాది కిరాతకానికి ఒడిగట్టాడు. నార్త్-వెస్ట్ ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో సాక్షి అనే మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు నమ్మలేని నిజాల్ని రాబట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం మృతురాలిని కత్తితో పదుల సంఖ్యలో పొడిచిన సాహిల్ ..కేవలం 30సెకన్లలోనే మైనర్ బాలికను చంపేసి..బండరాళ్లతో తలపై మోది చిద్రం చేశాడు. అక్కడి నుంచి నిందితుడు తన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి, ఆపై బస్సులో బులంద్‌షహర్‌లోని తన అత్త ఇంటికి వెళ్లాడు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, విచారణ అనంతరం సాహిల్ ఆచూకీ తెలుసుకున్నారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు మృతురాలు సాక్షి చేతిపై సాహిల్ పేరు పచ్చబొట్టు ఉండటాన్ని గమనించారు.
రెచ్చిపోయిన ప్రేమోన్మాది..
అయితే పోలీసులకు దొరికిన నిందితుడు సాహిల్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం..గత మూడేళ్లుగా మృతురాలు, నిందితుడు ప్రేమించుకున్నారు. తాజాగా అమ్మాయి తనను వదిలిపెట్టాలనుకుందని సాహిల్ పోలీసులకు చెప్పాడు. అయితే నిందితుడు చెప్పిన దాంట్లో నిజా, నిజాలు తెలుసుకుంటున్నారు పోలీసులు. ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టడం వల్లే ఆగ్రహానికి లోనైన సాహిల్ ఆమెతో శనివారం ఘర్షణపడ్డాడు. తర్వాత సాహిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాలిక బెదిరించింది.అంతే కంప్లైంట్ ఇస్తుందనే ఆలోచనతో పాటు తనను దూరం పెడుతోందనే కోపంతో రగిలిపోయిన సాహిల్ ఇంతటి దారుణానికి పాల్పడినట్లుగా తేల్చారు.
ప్రేమించి దూరం పెట్టిందనే కోపంతో..
గతంలో కూడా మృతురాలిని సాహిల్ తనను విడిచిపెట్టవద్దని డమ్మీ పిస్టల్‌తో బెదిరించాడని కూడా తెలుస్తోంది పోలీసులు విచారణలో రాబట్టిన ఆధారాల ప్రకారం సాహిల్ స్నేహితులు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు.నిందితుడిని విచారిస్తున్నారు.ఈకేసులో అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
*వైరల్ అవుతున్న వీడియో*..
దేశ రాజధాని నడిబొడ్డున అందరూ చూస్తుండగా ఓ మైనర్ బాలికను కత్తితో పొడవడం, కాళ్లతో తన్నడం, బండరాళ్లతో తల చిద్రం చేయడం చూసిన జనం భయంతో పరుగులు తీశారు. సీసీ కెమెరాలో రికార్డైన వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
సాహిల్‌ని విడిచిపెట్టవద్దంటున్న పేరెంట్స్ ..
మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డను అత్యంత కిరాతకంగా చంపి రక్తం కళ్ల చూసిన వాళ్లను విడిచిపెట్టవద్దని వేడుకుంటున్నారు. అయితే సాక్షిని చంపిన నిందితుడు ఆమె ప్రియుడే అనే ప్రచారంపై మృతురాలి తల్లి ఖండిస్తోంది. “సాహిల్‌ను ఎప్పుడూ చూడలేదని… మా కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈహత్యపై నెటిజన్లు, హిందువులు మండిపడుతున్నారు. మృతురాలు హిందువు అనే ప్రేమ పేరుతో మోసం చేసి చంపాడని విమర్శలు చేస్తున్నారు. అతడ్ని విడిచిపెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.