ఫిబ్రవరి నాటికి కరోనా అంతం..
భారత్‌లో కరోనా వైరస్ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కోవిడ్-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది. భారత్‌లో ప్రస్తుతం మొత్తం 75 లక్షల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.