Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దుర్వాసనతో బతకలేకపోతున్నాం

కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో బతకలేకపోతున్నాం
న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కసిరెడ్డికి గిరిజనుల వినతి!!
మాడ్గుల మే 29 (నిజం న్యూస్) :
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఏదైతే మాడుగుల మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ శివారులో దాన తయారీ పేరుతో కంపెనీ ఏర్పాటుచేసిన యజమాని నిబంధనలకు విరుద్ధంగా

ALSO READ: సినిమా పక్కిలో గంజాయి స్మగ్లింగ్

మూగజీవాల అవశేషాలతో తయారు చేస్తున్న పౌడర్ల వల్ల వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల ఆవాసమున్న గిరిజన, చుట్టుపక్కల గ్రామాల రైతులందరు  అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కి ఆదివారం గిరిజనులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గిరిజన నాయకులు బాలు నాయక్ మాట్లాడుతు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసుకోలేదని తనకున్న రాజకీయ పలుకుబడితో అడవిలో కంపెనీని ఏర్పాటు చేసి తన ఇష్టానుసారం.వ్యర్థాలతో పాటు పొల్యూషన్ గాలిని వదిలి ప్రజల జీవితాలతో ఆడలాడుతున్నారనీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజనులు లక్పతి నాయక్,  సూర్య, రమేష్ రవీందర్, మత్రు నాయక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.