సినిమా పక్కిలో గంజాయి స్మగ్లింగ్
*అరటన్ను గంజాయి సీజ్ చేసిన పోలీసులు
పట్టుబడిన గంజాయి విలువ ఒక కోటి రూపాయలు. ఏ ఎ.స్పి పారితోష్ పంకజ్
చర్ల మే 29 (నిజం న్యూస్) భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ ఉత్తర్వుల మేరకు సోమవారం కూనవరం రోడ్డు చెక్ పోస్ట్ సిఆర్పిఎఫ్ క్యాంప్ వద్ద ఎస్ఐ శ్రీకాంత్. నేతృత్వంలో పోలీస్ సిబ్బంది వాహన తనిఖీలు చేస్తుండగా సినిమా పక్కిలో మల్కాగిరి ఒరిస్సా రాష్ట్రం కు చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో 485 కిలోల గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో గల మల్కాజిగిరి వద్ద నుండి కరీంనగర్ కు భద్రాచలం మీదుగా గంజాయి అక్రమం గా తరలిస్తుండగా పోలీసులు రఘునాథ్.రబీంద్ర అను ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారణ చేసినట్లు తెలిపారు
విచారణలో మరో ఆరుగురు ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు ఒక గంజాయి ప్యాకెట్ ఐదు కిలోల బరువు ఉంటుందని 97 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుబడిన గంజాయి విలువ రూ ఒక కోటి ఉంటుందని తెలిపారు
Also read: గన్ వదిలి పెన్ను పట్టిన మాజీ నక్సలైట్
గంజాయి తరలించే ట్రాక్టర్ ట్రాలీకి సీక్రెట్ ఛాంబర్ ను ఏర్పాటు చేసుకుని పలుమార్లు విజయవాడ గుంటూరు కరీంనగర్ లో అమ్మినట్లుగా తెలుస్తోంది ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు