శ్వాస కోశ వ్యాధులకు ఉత్తమ ఔషధమీ మొక్క
అడ్డసరము మొక్కను వసాకా అని కూడా అంటారు. ఇది రోడ్ల వెంట గుంపులు గుంపులుగా పెరిగే మొక్క. తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను దడిగా కట్టుకోవడానికి ఉపయోగిస్తుంటారు. ఇది అద్భుత ఔషధ మొక్క అని చాలా మందికి తెలీయదు.
ఈ చెట్టులో వేర్లు, కాండము, ఆకులు అన్ని భాగాలు ఔషధంగా పని చేస్తాయి. కరోనా సమయంలో ఈ మొక్క ఔషధాన్ని చాలా మంది వాడి ఉపశమనం పొందారు.
ALSO READ: నపుంసకత్వాన్ని తొలగించే మొక్క ఇదే
ఈ మొక్క ఉపయోగాలు…
శ్వాస కోశ వ్యాధుల నివారణకు…
ఈ మొక్క ఆకు రసమును గాని, వేరు రసమును గాని 1 స్పూన్ , అల్లం రసం అర స్పూన్ కలిపి కొన్ని రోజులు తీసుకున్నా శ్లేష్మం పడిపోయి దగ్గు, ఉబ్బసం తగ్గుతుంది.
కీళ్ల నొప్పులకు…
దీని ఆకుల గాఢ కషాయంతో నొప్పి ఉన్న చోట మర్ధనం చేసిన నొప్పి తగ్గుతుంది.
ఎర్రబట్ట నివారణకు…
వేరు రసమును 1 స్పూన్ అరకప్పు పాలలో కలిపి కొద్దిగా చక్కర కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
తలనొప్పి…..
అడ్డసరము పూలను నీడన ఎండించి మొత్తటి చూర్ణం చేసుకుని 10 గ్రాముల చూర్ణమునకు తగినంత పాతబెల్లం కలిపి నాలుగు ఉండలను చేసి తలనొప్పి మొదలవగానే 1 ఉండను మింగితే తలనొప్పి రాకుండా పోవును.
మూత్ర పిండాల నొప్పి…
అడ్డసరము ఆకులను, వేప ఆకులను సమానంగా తీసుకుని వెచ్చచేసి నాభి క్రింద కాపడము పెడుతూ ఉంటే, అలాగే 5 గ్రాముల అడ్డ సరము ఆకులను రసంనందు సమానంగా తేేనె కలిపి తాగుతున్న భయంకరమైన మూత్ర పిండాల నొప్పి కూడా తగ్గిపోతుంది.
రక్త మొలలు…..
నీడన ఎండబెట్టిన ఆకుల చూర్ణానికి సమానంగా చందనము పొడి కలిపి 5 గ్రాముల మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకున్న మొలల నుండి రక్తం కారడం తగ్గిపోతుంది.
దురదలు, పొక్కులు…
10 నుండి 12 లేత ఆకులను 2 నుండి 5 గ్రాముల పసుపు, గోమూత్రం తో కలిపి లేపనం చేసిన వెంటనే దురదలు, పొక్కులు తగ్గిపోతాయి.
శరీర దుర్గంధం…
ఆకుల రసం నందు కొద్దిగా శంఖ చూర్ణం కలిపి లేపనం చేస్తూ ఉంటే శరీర దుర్వాసన పోతుంది.
కాళ్లు, చేతులు లాగుట…
ఆకుల రసం, నువ్వుల నూనెతో కలిపిన తరువాత ఆ తైలంను మర్ధనం చేసిన కాళ్లు, చేతులు లాగడం, నరాలు పీకడం తగ్గిపోతాయి.
కామెర్లు…
10 మిలీ ల ఆకుల రసానికి తేనె, ఖండశర్కర కలిపి తాగిస్తూ ఉంటే కామెర్లు తగ్గిపోతాయి.
పండ్ల తీపులు.,..
ఆకుల కషాయాన్ని ప్రతీ రోజూ పుక్కిలించిన పండ్ల తీపులు తగ్గిపోతాయి.
వాసా టీ..
ఎండించిన ఆకులను టీ లాగా కాచి రాత్రి పూట తాగి పడుకుంటే సుఖంగా నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.