నపుంసకత్వాన్ని తొలగించే మొక్క ఇదే
అనేక వ్యాధులను తొలగించే అధ్భుతమైన మొక్కగా అక్కల కర్రకు పేరుంది. తెలుగు రాష్రాలలో కొండలు, గుట్టలపైన ఇది దొరుకుతుంది. దీని వేర్లకు ప్రపంచ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ మొక్క మొత్తం ఔషధంగా పనికి వస్తుంది.
ఈ మొక్క పార్శపు నొప్పి, టాన్సిల్స్, పుప్పిపండు, దగ్గు, పక్షవాతం, కామోద్దీపనమం, సయాటికా, మందబుద్ది, నత్తి, ఎక్కిళ్లను తగ్గిస్తుంది.
ALSO READ: అంతర తామరతో థైరాయిడ్, మధుమేహానికి చెక్
ఈ మొక్కను ఎలా వాడితే వ్యాధులు నయం అవుతాయో చూద్దాం..
పార్శపునొప్పి
అక్కల కర్రను గంధంగా తీసి లేపము చేసిన పార్శపు నొప్పి, తలనొప్పి తగ్గుతుంది.
టాన్సిల్స్..
కషాయమును నోటిలో నింపి కాసేపు పుక్కిలించిన టాన్సిల్స్ తగ్గును
పుప్పిపంటిపై……
పుప్పింపంటిపై దీనిని నీటితో నూరి పెట్టినా, లేదా చూర్ణం చేసి పుప్పి పంటిపై పెట్టిన వెంటనే నొప్పి తగ్గును.
దగ్గు…
దీని కషాయమును 30 మిలీ మోతాదులో తాగుతున్న పురాణ దగ్గులు తగ్గును
పక్షవాతం…
దీని చూర్ణంను ఆవ నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ కలిపి మర్ధన చేసిన పక్షవాతం తగ్గును.
కామోద్దీపనము…
అక్కలకర్ర, అశ్వగంధ, సపేధ్ ముసలిలను సమానంగా పొడిచేసి ఉదయం, సాయంత్రం 1 స్పూన్ మోతాదు పాలలో కలిపి తీసుకుంటే నపుంసకత్వం తగ్గి, కామోద్దీపనములు కలుగును.
సయాటికా…
వేళ్ల చూర్ణాన్ని అఖ్ రోట్ తైలంతో కలిపి మర్ధనం చేసిన సయాటికా నొప్పి తగ్గుతుంది.
మందబుద్ది…
అక్కలకర్ర, బ్రాహ్మీ సమానంగా కల్పిన చూర్ణాన్ని 1/2 స్పూన్ మోతాదులో ప్రతీరోజూ తీసుకుంటే మంద బుద్ది పోతుంది.
నత్తి…
వేరు చూర్ణానికి, మిరియాల పొడి, తేనే కలిపి నాలుకపై రుద్దుచున్న నత్తి తగ్గిపోయి మాటలు స్పష్టంగా వస్తాయి.
ఎక్కిళ్లు…
1 గ్రా. చూర్ణానికి తేనె కలిపి నాకిన ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.