Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

టాస్క్ ఫోర్స్ వాహనంతో ట్రాఫిక్ నియంత్రణ

ట్రాఫిక్ సమస్య కు నిమిషాల్లో పరిష్కారం —– ఇ. వెంకట్ రెడ్డి.

కుత్బుల్లాపూర్: మే 28 (నిజం న్యూస్)

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇకపై జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పడే ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ ట్రాన్స్ఫోర్స్ వాహనాలు రోడ్లపై తీసుకుపోనున్నాయి.

ALSO READ: వేద పాండిత్యంలో చీకోడు వాసికి డాక్టరేట్

ఏదైనా ఓ ప్రాంతంలో ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలిగితే ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ వాహనం ద్వారా ట్రాఫిక్ ను క్లియర్ చేస్తారు. ఇటీవల సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివాహనాలను ప్రారంభించారు.

జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేయునున్న టాస్క్ ఫోర్స్ వాహనాన్ని జీడిమెట్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఇ. వెంకట్ రెడ్డి పరిశీలించి, వాహన పనితీరును అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆ వాహనంపై కొద్ది దూరం ప్రయాణించారు.