మనుగడ మాసపత్రికను ఆవిష్కరించిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్…

మండలంలోని కరివారిగూడెం, పంచాయతీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, “మన్యం మనుగడ” ప్రారంభ తొలి మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ మాస పత్రిక ఆవిష్కరణలో ప్రజా ప్రతినిధుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పిటిసి భూక్య కళావతి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, కరివారి గూడెం సర్పంచ్, శాంతిరాం, మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.