Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నోటీసులు ఇవ్వకుండా మొండికేసిన తహశీల్దార్

*నోటీసులు ఇవ్వకుండా రైతులతో వాగ్వాదం

**నలభై ఏళ్లుగా పొజిషన్ లో బాధిత తులు
దుమ్మగూడెం మే 28 ( నిజం న్యూస్)
ఏడాది క్రితం సర్వే కోసం పెట్టిన ఒక దరఖాస్తు విషయంలో ఈ ఏడాదిలో దుమ్ముగూడెం తహశీల్దార్  అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఏకంగా సబ్ ఇన్సిపెక్టర్ సహా ఐదుగురు పోలీసు కానిస్టేబుల్లను తీసుకుని రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే…. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరవరం రెవెన్యూ గ్రామంలో ని 79/అ, 80 సర్వే నెంబర్లలో కాక ధర్మయ్య, కాక రామయ్య ,కాక సీతయ్య , కాక నాగేశ్వరరావు, కాక కోటేశ్వర రావు, కాక వీరాస్వామి, కాక నర్సింహారావు లకు తాత ముత్తాతల నుండి వంశ పారంపర్యంగా సంక్రమించిన వ్యవసాయ భూములను ప్రశాంతంగా ఎలాంటి వివాదాలు లేకుండా సాగు చేసుకుంటున్నారు.

ALSO READ: ఏలూరు జిల్లాలో నకిలీ భూమి పట్టాల కలకలం

అయితే నిన్న హఠాత్తుగా దుమ్ముగూడెం తహశీల్దార్ ప్రతాప్ రెవెన్యూ సిబ్బంది తో పాటూ పోలీసులను తీసుకుని సాగులో ఉన్న రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సరాసరి భూమి మీదకు వెళ్లారు. అక్కడికే రైతులను పిలిపించి కనీసం నోటీసులు ఇవ్వకుండా సంతకాలు చేయించి మళ్ళీ వచ్చే నెల సర్వే నిర్వహిస్తామని వెళ్లారు.

నోటీసులు ఇవ్వాల్సిందిగా కోరినా తహశీల్దార్ ససేమిరా అనడం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉన్నాయోనని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాకుండా పదిహేను రోజుల సమయం కావాలని రైతులు కోరినట్లు వారినుండి వాంగ్మూలం తీసుకోవడం విశేషం.

*నోటీసులు ఇవ్వకుండా మొండికేసిన తహశీల్దార్

తహశీల్దార్ ఇంతగా హడావుడి చేసిన ఈ భూమి విషయంలో సర్వే కోసం కణితి రాముడు అనే వ్యక్తి పోయిన సంవత్సరం మే నెలలో దరఖాస్తు పెట్టాడు.అయితే స్థానికులు మాత్రం సదరు కణితి రాముడు అనే వ్యక్తి గానీ వారికి సంబంధించిన వారు కానీ గత నలభై ఏళ్లుగా భూమి వైపు కన్నెత్తి కూడా చూడలేదని చెప్తున్నారు.

అంతే కాకుండా తహశీల్దార్ ఈ సంవత్సరం సర్వే నోటీసుల ఇవ్వడం అదికూడా తారీఖున కొట్టివేసి ఇవ్వడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. అన్నింటికీ మించి ఎలాంటి వివాదం లేని ఈ విషయంలో పోలీసుల సహకారం ఎందుకు తీసుకున్నారో అర్థం కాని విషయం.

అసలు పోయిన సంవత్సరం దరఖాస్తు వస్తే ఇన్నిరోజులు ఎందుకు తాత్సారం చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సదరు భూమిలో ఇప్పటివరకు ఎవ్వరికీ తెలంగాణ పట్టాదారు పుస్తకాలు మంజూరు కాలేదు. అదేవిధంగా సదరు సర్వే నంబరులో మొత్తం ఎంత విస్తీర్ణం ఉంది ఎన్ని నెంబర్ల ఫోడి అయ్యాయి అనేది ఇంకా తెలియదు.

ఏదైనా దరఖాస్తు వస్తే ఏకపక్షంగా వ్యవహరించకుండా రికార్డులు మాత్రమే కాక పొజిషన్లో ఎవరున్నారు, ఎన్ని సంవత్సరాలుగా సాగులో ఉన్నారన్న స్థానిక విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవడం రివాజు.

కానీ ప్రస్తుత విషయంలో ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇంత హఠాత్తుగా సర్వే అంటూ తహశీల్దార్ హడావుడి చేస్తున్నారో అని స్థానికులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

సాగు రైతులకు, హద్దు రైతులకు ఇవ్వాల్సిన సర్వే నోటీసులు కూడా ఇప్పటికీ ఎవ్వరికీ ఇవ్వలేదు సరికదా అడిగినా కూడా ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడం తహశీల్దార్ మొండి వైఖరికి నిదర్శనం.