వడదెబ్బకు యువకుడు మృతి
మరిపెడ మే 28 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం మహమ్మద్ అబ్దుల్ అజీజ్ (40) ఆదివారం వడదెబ్బ తగిలి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మరిపెడ మండలం పూల బజారుకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అజీజ్ మున్సిపాలిటీ కేంద్రంలో పాన్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం ఎండ తీవ్రతకు వడదెబ్బ సోకడంతో ఇంటికి వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యుడు దగ్గరికి తీసుకువెళ్లగా సీరియస్ గా ఉంది ఖమ్మం తీసుకెళ్లమని తెలిపారు.
Also read: మండుతున్న ఎండలు.. చనిపోతున్న కోళ్లు… పెరుగుతున్న చికెన్ ధరలు
ఖమ్మం డాక్టర్లు కూడా హైదరాబాద్ తీసుకు వెళ్ళండి అని తెలపగా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ చేపించారు. ఆదివారం 10 గంటలకు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.