Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐటీ రైడ్స్‌

.. భారీ నగదు స్వాధీనం

మహబూబాబాద్ బ్యూరో మే 27 నిజం న్యూస్

ఐటీ సోదాలు హైదరాబాద్ లో నాలుగోరోజు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి

ఏకంగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నగరంలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఒకేసారి ఐటీ సోదాలు నిర్వహించింది. సుమారు 100 మంది బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

నగరంలో రియల్ ఎస్టేట్ సంస్థగా పేరొందిన కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Also read: హైదరాబాద్‌ అపురూపం

కేఎం కోహినూర్ గ్రూప్ కంపెనీ అహ్మద్ ఖాద్రీ ఇల్లు, 40 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భాగంగా భారీగా నగదు, స్థలాల డాక్యుమెంట్లు దొరికినట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఈ సోదాల్లో కేఎం కోహినూర్ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. బినామీ కంపెనీల పేరుతో రిజిస్టర్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ గుర్తించింది. కేఎం కోహినూర్ కు సంబంధించిన ఆరు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో నాలుగు రోజులుగా సోదాలు జరగడం సంచలనంగా మారింది.

ఎంత నగదు స్వాధీనం చేసుకున్నారనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ కంపెనీలో పలువురు రాజకీయ నేతల బినామీలు పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ గుర్తించింది. ఈ సంస్థ పలు ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కూడా వెంచర్లు వేసినట్లు తెలుస్తోంది. వారి వివరాలను కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

అలాగే హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న విజ్ రియల్టీలు, విజ్ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్ కోహినూర్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కేఎం కోహినూర్ కంపెనీ ప్రతినిధుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. క్రిస్టల్ మాన్షన్‌కు చెందిన ఆర్ఆర్ పాన్మసాలా, హాస్పిటాలిటీస్, స్పైసెస్, మజీద్ ఖాన్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, కర్ణాటక, నోయిడాలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.