Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నీట్ ఫలితాల్లో మెరిసిన ఏడూళ్ల బయ్యారం విద్యార్థిని కోడం లావణ్య

పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన కుమార్తె కోడం లావణ్య కు 531 మార్కులతో శుక్రవారం విడుదలైన నీట్ ఫలితాల్లోఆల్ ఇండియా కేటగిరి 26 వేల 900 ర్యాంకు సాధించినది. నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామీణ వైద్యులు కోడం నరసింహారావు, అన్నపూర్ణ ఎంతో కష్టపడి చదివించారు. మండలంలోని సెంట్ మేరీస్ స్కూల్ లో పదవ తరగతి స్కూల్ టాపర్ గా సాధించినది. ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణ కాలేజీలో చదివి గతేడాది హైదరాబాద్ లో హోమియో సీటు సాదించినప్పటికిని… ఎంబీబీఎస్ సీటు సాధిస్తానని నాన్నకు ఇచ్చిన మాట మేరకు పట్టుదలతో చదివి నాన్న కోరిక తీర్చింది. మెడిసిన్ పూర్తయిన తర్వాత గైనకాలజిస్ట్ అయి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు వైద్య సేవలు అందించాలని ఉంది అన్నారు.