అంతర తామరతో థైరాయిడ్, మధుమేహానికి చెక్
అంతర తామర. ఇది చెరువులలో, నీటి కుంటలలో పెరుగుతుంది. ఈ చెట్లు రెండు రకాలు అవి 1. చిన్న అంతర తామర 2. సాధారణ అంతర తామర లేదా పెద్ద అంతర తామర అని పిలుస్తారు.
పెద్ద అంతర తామర చెట్లను ఎక్కువగా ఔషధాలలో వాడుతుంటారు. చిన్న అంతర తామర చెట్లను కూడా వాడుతుంటారు.
అంతర తామర ఉపయోగాలు..
థైరాయిడ్ సమస్యకు….
థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లకు గొంతు దగ్గర వాపు ఉన్నట్లయితే అంతర తామరను ఎండించి ఆవ నూనెలో కలిపి లేపనం చేసిన చాలా తొందరగా తగ్గుతుంది.
సిబ్బెం, తామర నివారణకు…..
సిబ్బెం తామర ఉన్న వాళ్లకు మొత్తం మొక్కను ముక్కలుగా కత్తిరించి నీడన ఎండబెట్టి వెచ్చగా వేయించాలి. తరువాత పొడి చేసి కొబ్బరి నూనెతో కలిపి శరీరం అంతా రాసినచో సిబ్బెం తగ్గుతుంది. తామర కూడా తగ్గుతుంది.
కంతులు, గ్రంధుల నివారణకు…
పచ్చి మొక్కను ముద్దగా నూరి కంతుల పైన, గ్రంధుల పైన కడుతున్నట్లయితే అవి కరిగిపోతాయి.
షుగర్ సమస్య ఉన్న వాళ్లకు…
మధుమేహ వ్యాధి(షుగర్) వారికి సమస్య ఉన్న వాళ్లకు కాళ్లలో మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారి పోవడం, స్పర్శ తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. ఈ సమయంలో అంతర తామరను బాగా నూరి కాళ్లకు లేపనంగా చేస్తే తగ్గుతుంది.
ఉబ్బు రోగం…
శరీరమంతా ఉబ్బురోగం వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో అంతర తామర ఆకుల కషాయాన్ని 30 మి.లీ చొప్పున తాగుతున్న తగ్గుతుంది.
అధిక రుతుస్రావం ఉన్నట్లయితే…
నెలసరిలో వచ్చే అధిక రుతు స్రావం సమస్యకు ఆకులను ఎండబెట్టి, కాల్చి, బూడిద చేసి నెయ్యితో కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
చెవిపోటుకు…
ఆకుల రసాన్ని వెచ్చగా చేసి రెండు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది.
మొండి గడ్డలకు…..
సిఫిలిస్, ఎగ్జిమా, అల్సర్, మానని పుండ్లకు లోపలికి కషాయంగా, బయట లేపనంగా ఉపయోగించాలి.