కమిషనర్ సార్ జర నన్ను పట్టించుకోండి
మున్సిపాలిటీ కమిషనర్ సార్ జర నన్ను పట్టించుకోండి
తొమ్మిది వార్డు లో నీళ్ల బోరింగ్ చుట్టూ పిచ్చి మొక్కలు
నేరేడుచర్ల మే 27(నిజం న్యూస్ ):
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిది తొమ్మిది వార్డు లో నీళ్ల బోరింగ్ వద్ద చుట్టూ పిచ్చి మొక్కలు చెత్త చెదారం తో నిండి పోయింది. నీటిని పట్టుకోవాలంటేనే ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై వార్డు కౌన్సిలర్ కి, మున్సిపల్ వార్డు సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించు కోవటం లేదని ప్రజలు వాపోతున్నారు.
వార్డు లో సమస్యలు ఎవరికీ చెప్పాలో తెల్వటం లేదు. చెత్త బండి వారం రోజులు కూడ రావట్లేదు. ఇంట్లో చెత్త వుంటే దోమలు విపిరీతంగా వ్యాపించి విష జ్వరాలు వస్తున్న వార్డులో బ్లీచింగ్ పౌడర్ చల్లాల్సి ఉన్న మున్సిపల్ సిబ్బంది చల్లడం లేదు.
ALSO READ: పుట్టగొడుగుల పెంపకం పై కెవికెలో మహిళలకు శిక్షణ
వార్డ్ లో ఉన్న సమస్యలు తీరాలంటే ఇంటి పన్ను కడితేనే సమస్యలు తీరుతాయని మున్సిపల్ సిబ్బంది తెలుపుతున్నారు.
మున్సిపల్ కొత్త కమిషనర్ వార్డులలో తిరగకపోవడం, మున్సిపాలిటీలో సమస్యలు ఇంతవరకు తెలుసుకోకపోవడం, మున్సిపాలిటీ పనితీరు పర్యవేక్షించుకోవడం దారుణం