పుట్టగొడుగుల పెంపకం పై కెవికెలో మహిళలకు శిక్షణ
గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతి ఎన్. సుగంధి
గరిడేపల్లి మే 27 (నిజం న్యూస్).
గరిడేపల్లి మండలం గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకం పై మహిళలకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు గృహ విజ్ఞాన శాస్త్రవేత్త శ్రీమతిఎన్.సుగంధినిర్వహించారు.
శనివారం నాడు కెవికె లో పుట్టగొడుగుల పెంపకం పై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో మహిళలు మరియు నిరుద్యోగ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ ఖాళీ సమయంలో ఈ పుట్టగొడుగుల పెంపకం ద్వార మంచి పోషక ఆహారం తో పాటుగా స్వయం ఉపాధి కూడా పొందవచ్చని తెలియసేసారు.
ALSO READ: తాగావు…దేవాలయంలోనికి పోరాదు అన్నందుకే…
ఈ శిక్షణ లో ఎన్. సుగంది గృహ విజ్ఞాన శాస్త్రవేత్త పుట్టగొడుగుల పెంపకానికి కావలసిన నైపుణ్యత శిక్షణా అంశాల గురించి తెలియజేసి వారికి శిక్షణను ఇచ్చారు.
నూతనంగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టేవారికి మరియు ఇంతకుముందు చేపట్టినవారికి కెవికె ద్వారా శిక్షణా, సాంకేతిక సలహాలు, సూచనలు, వివిధ రకాల పుట్టగొడుగుల పెంపకం యాజమాన్యం గురుంచి తెలియ జేసి వారికి స్పాన్ (పుట్టగొడుగుల విత్తనము) ను అందించారు.
ఈ శిక్షణ కార్యక్రమములో గడ్డిపల్లి, నేరెడుచర్ల, గరిడేపల్లి, సూర్యాపేట నుంచి 6 గురు యువతులు, యువకులు పాల్గొన్నారు.