Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తాగావు…దేవాలయంలోనికి పోరాదు అన్నందుకే…

24 గంటల లోపే హత్య కేసును చేదించిన వన్ టౌన్ పోలీసులు.
మద్యం మత్తు తగాదాలే హత్యకు కారణం.. సీఐ సుబ్రహ్మణ్యం

ధర్మవరం మే 27 (నిజం న్యూస్): పట్టణంలోని సిద్దయ్య గుట్ట వద్ద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద సాకే నవీన్ కుమార్ అనే వ్యక్తిని అతి దారుణంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు హత్య చేసిన సంఘటనను,24 గంటలలోపే వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేసును చేదించడం జరిగింది.

ఈ సందర్భంగా శనివారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు యొక్క చేదింపు వివరాలను తెలిపారు. మృతి చెందిన సాకే నవీన్ కుమార్ వృత్తిరీత్యా పెయింటర్.

మృతునితోపాటు తమ్ముడు సాకే సాయినాథ్ కూడా ఇదే వృత్తి కొనసాగిస్తూ ధర్మవరంలో జీవించేవారని తెలిపారు. మృతుడు సాకే నవీన్, తమ్ముడు సాకే సాయినాథ్, ముద్దాయి నిమ్మల రెడ్డి శేఖర్ లు తాగుడుకు అలవాటు పడ్డారనీ తెలిపారు.

ALSO READ: పర్యావరణంను కాపాడాలి

శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో సాకే నవీన్ ను  శేఖర్ రెడ్డిను తాగి ఉండి, దేవాలయంలోనికి పోరాదు అని చెప్పగా, దానికి విభేదించి ముద్దాయి  శేఖర్ రెడ్డి గొడవపడి అక్కడే ఉన్న బండరాయితో తలమీద మూడుసార్లు మోదీ దారుణంగా హత్య చేసి పరారయ్యాడని తెలిపారు.

సిఐ సుబ్రహ్మణ్యం తో పాటు ఎస్సైలు మహమ్మద్ గౌస్, మహమ్మద్ రఫీ, ట్రాఫిక్ సిఐ వహీద్ భాషా, సిబ్బంది పలు బృందాలుగా ఏర్పడి కేసును చేదించడం జరిగిందని తెలిపారు.

ముద్దాయి నిమ్మల రెడ్డి శేఖర్ ను శనివారం సాయంత్రం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో కనపడగా అరెస్టు చేయడం జరిగిందన్నారు.

హత్య చేసిన ముద్దాయి అన్నమయ్య జిల్లా కంబల్లపల్లి మండలం, కప్పల వారి పల్లి గ్రామానికి చెందిన వాడని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి వన్ టౌన్ సిఐను, ట్రాఫిక్ సిఐను, సిబ్బందిని అభినందించడం జరిగిందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కేతన్న, సిబ్బంది రాజప్ప, రాజన్న, జాకీర్ హుస్సేన్, రాము, అప్ప స్వామి, వెంకటేశులు, శివశంకర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు