Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పర్యావరణంను కాపాడాలి

పర్యావరణం పై అవగాహన కోసం పోస్టల్ సిబ్బంది రోడ్ షో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మే 27,(నిజం న్యూస్) బ్యూరో :: పోస్టల్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మే1 నుండి జూన్ 5 వరకు వివిధ కార్యక్రమాలు జరుపబడుతున్నవి.

అందులో భాగంగా శనివారం ద్రాక్షారామం లో మిషన్ లైఫ్ అనగా లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ గూర్చి ద్రాక్షారామంలో పోస్టల్ సిబ్బంది రోడ్ షో నిర్వహించారు. పర్యావరణం కాపాడుటకు తీసుకోవలసిన జాగ్రతల పైన ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

అనగా మొక్కలు నరకడం, ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకం మానేసి, దానికి బదులు క్లోత్ బ్యాగ్స్ వాడడం, నీళ్ళని, విద్యుత్ ను, పెట్రోల్ డీజిల్ ను జాగ్రత్తగా వాడడం అంటే అవసరం లేనపుడు టాప్స్ కట్టివేయడం , అవసరం లేనప్పుడు స్విచెస్ ఆఫ్ చెయ్యడం ద్వారా విద్యుత్ ఆదా చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాలు ఆపివేయడం ద్వారా పెట్రోల్ ఆదా చేయడం వంటి విధానాల పై అవగాహన కల్పించడం జరిగింది.

ALSO READ: ఆగి ఉన్న బైక్ లో మంటలు
ఈ కార్యక్రమంలో ద్రాక్షారామం పోస్టల్ సిబ్బంది,కే.గంగవరం పోస్టల్ సిబ్బంది, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పోస్టల్ సిబ్బంది అందరూ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. రామచంద్రపురం సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఎం లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ రోడ్ షో నిర్వహించబడింది.