Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అటవీ శాఖ అధికారులకు కృష్ణా జింక అప్పగింత

మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు గ్రామానికి చెందిన ముయ్యబోయిన ప్రభాకర్ తన ఎడ్లు, గొర్రెలను అడవికి మేతకు తీసుకెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గొర్రెల తో కలిసి కృష్ణ జింక పిల్ల తన ఇంటికి వచ్చింది. ఇది గమనించిన ప్రభాకర్ వి ఎస్ ఎస్ చైర్మన్ తొలెం అనంత రావు, ఎంపీటీసీ బుర్కా పుష్పలత నరేందర్ లకు సమాచారం అందించడంతో వారి సహకారంతో స్థానిక బీట్ ఆఫీసర్ సందీప్ కు సమాచారం చేరవేశారు. దీంతో గుంజేడు కు చేరుకున్న అటవీ శాఖ అధికారులకు ఎంపిటిసి పుష్పలత చేతుల మీదుగా అటవీ శాఖ అధికారులకు కృష్ణ జింక అప్పగించారు. దీంతో సంబంధిత అటవీ అధికారులు కృష్ణ జింక ని కాపాడిన గొర్రెల కాపరి ప్రభాకర్ ను, స్థానిక ప్రజా ప్రతినిధులను అభినందించారు. స్వాధీనపరుచుకున్న కృష్ణ జింకను హన్మకొండ లోని వన విజ్ఞాన కేంద్రానికి తరలించనునట్లు తెలిపారు.