ఆగి ఉన్న బైక్ లో మంటలు
బైక్ నుండి ఒక్కసారిగా చెలరేగిన మంటలు.
పరుగులు తీసిన స్థానికులు.
ఏటూరునాగారం మే 27 నిజం న్యూస్:
ఏటూరునాగారం మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం నుండి ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రజలు పరుగులు తీసారు.
వివరాల్లోకి వెళ్తే మండలం కేంద్రంలో వ్యాపార షాపు వద్ద ఓ ద్విచక్ర వాహన దారుడు తన పని నిమిత్తం బైక్ మీద వచ్చి షాప్ ముందు పార్కింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కంగారు పడి బైక్ ను అక్కడే వదిలేసి పరుగులు తీశాడు.
ALSO READ: జోరుగా తునికాకు సేకరణ
గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నం చేసి మంటలను ఆర్పి వేసారు. ఏమైందని విచారించగా బైక్ లో అప్పుడే
పెట్రోల్ ఫుల్ టాంక్ కొట్టించగా, మంటలు వ్యాప్తి చెందినట్లు తెలిసింది.
అనంతరం బైక్ ను రిపేరు చేయించడానికి తరలించారు.