Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జోరుగా తునికాకు సేకరణ

పలిమెల మండల కేంద్రంలో జోరుగా తునికాకు సేకరణ

పలిమెల (భూపాలపల్లి) మే 27 (నిజం న్యూస్).

యాభై ఆకులకట్టకు మూడు రూపాయలు మరియు బోనస్ రూపాయలు
త్వరలో మరికొన్ని గ్రామాల్లో ప్రారంభం
బీడీలా తయారిలో ఈ ఆకు వినియోగం
బీడీ కార్మికులకు కూడా ఉపాధి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండల కేంద్రంలో గత మూడు రోజులుగా తునికాకు సేకరణ జోరుగా సాగుతుంది. ప్రజలు వేకువజామున్నే మేలుకొని అడవిబాట పడుతున్నారు.

చెట్టు, పుట్ట తిరుగుతూ తునికాకు సేకరిస్తూ రోజుకు నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయలు సంపాదిస్తున్నారు. పలిమేల కేంద్రంగా నాలుగు కల్లాలు నిర్వహిస్తున్నారు.

ALSO READ: జమాలి తోటను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

కల్లానికి ఇద్దరు నుండి ముగ్గురు కల్లెదారులు నలుగురు నుండి ఐదుగురు తునికాకు కట్టలను వరసగా పేర్చేపనిలో(లూజింగ్ )ఉపాధి పొందుతున్నారు.
మండుటెండల్లో సైతం జీవన ఉపాధికోసం బ్రతుకు పోరాటం చేస్తున్నారు.

ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగింపు దశకు రావడంతో ప్రజలు తునికాకు సేకరణకు వెళ్ళుతున్నారు. కళ్ళం నిర్వాహకులు తొందరగా డబ్బులు చెల్లించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ప్రస్తుతం పని దొరకని చాలా మందికి ఈ తునికాకు సేకరణ ఒక్క ఉపాధి అవుతుంది. ప్రజలు దీనిని వినియోగించు కోవాలని కల్లం నిర్వాహకులు ప్రజలను కోరుతున్నారు.