జమాలి తోటను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
అబ్బాయి పాలెం లో అగ్నిప్రమాదం…
సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది
మరిపెడ మే 27 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని అబ్బాయి పాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు జమాలితోటకు నిప్పంటుకొని అగ్ని ప్రమాదానికి గురైన శనివారం చోటు చేసుకుంది.
Also read: సెంట్రల్ జైలు ఉన్నట్టా? లేనట్టా❓️
అలవాల భద్రయ్య, అలవాల చంద్రయ్య, అలవాల రామస్వామి, రైతులకు చెందిన మూడు ఎకరాల జమాలి తోట ఉన్నది. గుర్తు తెలియని వ్యక్తుల చేత నిప్పంటుకుంది.
చేను పక్కన వారు చూసి రైతులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలపగా హుటా హుటిన అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పి వేశారు.
దీంతో పెను ప్రమాదం తప్పింది.