Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సెంట్రల్‌ జైలు ఉన్నట్టా? లేనట్టా❓️

రెండేళ్లవుతున్నా అతీగతీ లేని పనులు

మహబూబాబాద్ బ్యూరో మే 27 నిజం న్యూస్

కారాగారంగానే కాకుండా ఓ కర్మాగారంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ సెంట్రల్‌ జైలు అడ్రస్‌ గల్లంతైంది. ఎందరో రాజకీయ ఖైదీలు, ఉద్యమకారులకు జీవిత పాఠాలు నేర్పిన జైలు నేలమట్టమై రెండేళ్లు గడిచిపోయాయి. వరంగల్‌ నగర నడిబొడ్డున ఉన్న జైలు స్థలంలో 24 అంతస్థులతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తుండగా, జైలు కోసం కొత్తగా కేటాయించిన స్థలంలో మొండి గొడలే కనిపిస్తున్నాయి.

ఒక పక్క జైలు నిర్మాణం కాక, పోలీసులు, ఖైదీలు, జైలు సిబ్బంది నానా పాట్లు పడతున్నారు. పొరుగు జిల్లాలకు ఖైదీలను తరలించడం, అక్కడి నుంచి కోర్టులకు తరలించడం పెద్ద ప్రహసనంలా మారిపోవడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. వెయ్యి మంది ఖైదీలతో దక్షిణ భాతర దేశంలోనే ఓపెన్‌ ఎయిర్‌ సెంట్రల్‌ జైలుగా వర్ధిల్లిన సెంట్రల్‌ జైలు ఇప్పుడు గూడు లేని పక్షిలా 40 మంది ఖైదీలతో అరకొర భవనాల్లోనే కొనసాగుతోంది.

ముందుకు సాగని పనులు..

2021 జూన్‌ 14న కూల్చివేతలు ప్రారంభమై సెంట్రల్‌ జైలు 20 రోజుల్లోనే నేలమట్టమైంది. 256 ఎకరాల్లో హెల్త్‌ సిటీ నిర్మాణంలో భాగంగా కూల్చివేసిన సెంట్రల్‌ జైలు స్థానంలో 24 అంతస్థుల మల్టిస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే, మామునూరు 4వ బెటాలియన్‌ ప్రాంతంలో వంద ఎకరాల్లో చేపడుతామన్న సెంట్రల జైలు నిర్మాణం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.

దీంతో వివిధ ప్రాంతాల్లో ఉన్న రిమాండ్‌ ఖైదీలను వరంగల్‌ కోర్టుకు తీసుకురావడానికి ఎస్కార్ట్‌ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ములాఖత్‌ కోసం వచ్చే ఖైదీల బంధువులకు తిప్పలు తప్పడం లేదు. వంద ఎకరాల్లో అన్ని హంగులతో నిర్మాణం చేపడుతామన్న సెంట్రల్‌ జైలు నిర్మాణం అతీగతీ లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న వరంగల్‌ సెంట్రల్‌ జైలును ఆగమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వం, నిర్మాణంలో ఆ చొరవ చూడం లేదని మేధావులు మండిపడుతున్నారు. నిర్మాణం కోసం రూ.254 కోట్లకు పరిపాలన సంబంధమైన అనుమతులే తప్ప బడ్జెట్‌ కేటాయింపు ఇప్పటి వరకు జరగలేదు.

Also read: కౌరవ సభ పోవాలి… గౌరవ సభ రావాలి

40 మంది ఖైదీలతో..

వరంగల్‌ సెంట్రల్‌ జైలు ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ఖైదీలను ఈ జైలుకే తరలించేవారు. 32 రకాల బ్యారక్‌లలో వివిధ రకాలైన కేసుల్లో శిక్ష పడిన వెయ్యి మంది ఖైదీలు ఉండేవారు. ఇప్పుడు మామునూరు 4వ పటాలం పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ ఎయిర్‌ జైలులో 40 ఖైదీలు మాత్రమే ఉంటున్నారు.

తొలి ఓపెన్‌ ఎయిర్‌ జైలు

దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటి ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రసిద్ధిగాంచింది. 256ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ కమతాలతో ఉండేది. 1886లో నిజాం కాలంలో బ్రిటీష్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో దీని నిర్మాణం జరిగింది. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది సరమయోధులను వరంగల్‌ సెంట్రల్‌ జైల్లోనే బంధించి ఉంచారు. అలాగే రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కాళోజీ నారాయణరావు, హయగ్రీవాచారి లాంటి వారు కూడా ఈ జైల్లోనే గడిపినట్లు చెప్పుకుంటారు.

1955లో ఆనాడు అస్సాంలో జరిగిన అల్లర్లను అదుపు చేయడానికి మామునూరులో 435.05 ఎకరాల విస్తీర్ణంలో ఫోర్త్‌ బెటాలియన్‌ ఏర్పాటు చేశారు. కాల క్రమేణ బెటాలియన్‌లోనే 59 ఎకరాల్లో పోలీసు శిక్షణ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇంకా 23.20 ఎకరాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయం, 10 ఎకరాలలో మామునూరు ఏసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. బె టాలియన్‌ నిర్వహణకు 344.05 ఎకరాల భూమి మిగిలింది. ఈ భూమిలో నుంచి 101 ఎకరాల భూమిని సెంటల్‌ జైలుకు కేటాయించారు.

జైలుకు కేటాయించిన స్థలంలో ఎకరం భూమిలో రామాలయం, శివాలయం, గణపతి ఆలయం నిర్మిస్తున్నారు. ఇందుకోసం జైలు అధికారులతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులతో రామాలయ డెవల్‌పమెంట్‌ సొసైటీ ఏర్పాటు చేశారు.

*నిర్మాణం ఎప్పుడు..

జైలు కూల్చివేతకు ముందు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ శివారులోని మామునూరు 4వ బెటాలియన్‌ ప్రాంతంలోని వంద ఎకరాల్లో పూర్వపు సెంట్రల్‌ జైలుకు తలమానికంగా అన్ని హంగులతో నిర్మాణం చేపడుతామని ప్రకటించారు. ఇందుకోసం 4వ బెటాలియన్‌లో వంద ఎకరాల స్థలా న్ని కేటాయించారు. నిర్మాణం కోసం రూ.254 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులను మాత్రమే ప్రభు త్వం జారీ చేసింది. ఇందులో ఒక్కపైసా కూడా ఇప్పటి వరకు విదిల్చలేదు. దీంతో జైలు నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు…..